Rich Habits : ‘రిచ్’ కావాలని ఎవరికి మాత్రం ఉండదు. ప్రతి ఒక్కరూ తాము ధనవంతులుగా ఎదగాలని కోరుకుంటారు. అందుకోసం కలలు కనడంతో పాటు శారీరకంగా, మానసికంగా శ్రమిస్తుంటారు. ఉద్యోగం చేసినా, వ్యాపారం చేసినా.. ధనవంతులు కావడాన్నే టార్గెట్‌గా పెట్టుకుంటారు. అయినా చాలామంది ధనవంతులయ్యే రేసులో వెనుకంజలోనే మిగిలి పోతుంటారు. అలాంటివారు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్స్ ఈ కథనంలో ఉన్నాయి. అవి తెలుసుకోండి.
Also Read :Zainab Ravdjee : అఖిల్‌కు కాబోయే భార్య జైనబ్.. వయసులో తొమ్మిదేళ్లు పెద్దదా ?
రిచ్ అయ్యే సీక్రెట్స్
- ధనవంతులు కావాలంటే.. తొలుత అప్పులు చేయడం ఆపేయాలి. అత్యవసరమైతే తక్కువ వడ్డీ అప్పులనే తీసుకోవాలి. అప్పులను తీర్చే క్రమంలో ఎక్కువ వడ్డీ ఉన్న అప్పులను(Rich Habits) ముందుగా తీర్చేయండి.
- ఇతరులను చూసి హంగు ఆర్బాటాలతో జీవించకూడదు. సింపుల్‌గా జీవించండి. అనవసర ఖర్చులు చేయొద్దు. అవసరం లేనివన్నీ కొనకండి. మీకు ఉన్న ఆర్థికశక్తి కంటే తక్కువ రేంజులో జీవించడం అలవాటు చేసుకోండి.
- ఇంటి కోసం ఏదైనా కొనేటప్పుడు బేరమాడండి. అందులో తప్పులేదు. దానివల్ల చాలావరకు డబ్బులు సేవ్ అవుతాయి.
- ప్రైవేటు జాబ్స్ చేసుకునే వాళ్లు ఎప్పుడూ అలర్ట్ మోడ్‌లో ఉండాలి. కుటుంబానికి ఏదైనా అత్యవసరం వస్తే.. సాధారణ తరహా ప్రైవేటు కంపెనీలు ఏవి కూడా ఆదుకోవు. అందుకే ఎమర్జెన్సీ అవసరాల కోసం కనీసం 6 నెలల శాలరీని రెడీగా పెట్టుకోండి. జాబ్ పోయినా, ఇంట్లో ఎవరికైనా ఎమర్జెన్సీ చికిత్స చేయించాల్సి వచ్చినా ఆ డబ్బులు పనికొస్తాయి.
- ఆదాయం, ఖర్చుల ఆధారంగా నెలవారీ బడ్జెట్‌ను మెయింటైన్ చేయాలి. మన బడ్జెట్‌కు అనుగుణంగా ఖర్చులు ఉండేలా ప్లాన్ చేసుకోవాలి. బడ్జెట్ అడ్జస్ట్ కాకుంటే.. ఆ నెలలో అత్యవసరం కాని కొన్ని ఖర్చులకు కోత పెట్టాలి.
Also Read :OTP Disruption : డిసెంబరు 1 నుంచి కొన్ని ఓటీపీలు లేట్.. ఇంకొన్ని ఓటీపీలు రావు
- మనకు ప్రతినెలా వచ్చే శాలరీలో తొలుత ఇంటి ఖర్చుల కోసం డబ్బును పక్కన పెట్టాలి. ఇంటి అవసరాలన్నీ తీరాక.. పొదుపు, పెట్టుబడుల కోసం మనీని కేటాయించాలి. పొదుపు, పెట్టుబడి రెండూ ఏకకాలంలో చేయలేకపోతే.. కనీసం చిన్న మొత్తాన్ని ప్రతినెలా పొదుపు చేయడం మొదలుపెట్టండి. ఆదాయం కొంత పెరిగాక.. పెట్టుబడుల గురించి ఆలోచించండి.
- పెట్టుబడులు పెట్టేందుకు.. స్టాక్ మార్కెట్‌తో పోలిస్తే మ్యూచువల్ ఫండ్లు చాలా బెటర్. అయితే వాటిలో కూడా రిస్క్ ఉంటుంది. స్టాక్ మార్కెట్‌తో పోలిస్తే మ్యూచువల్ ఫండ్లలో రిస్క్ చాలా తక్కువ. అయితే అవి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ కోసం పనికొస్తాయి. కనీసం మూడేళ్లు డబ్బులు ముట్టుకోను అనుకుంటే.. మ్యూచువల్ ఫండ్లలోకి వెళ్లొచ్చు. ప్రతినెలా కొంత వాటిలో జమచేయొచ్చు. ఒకేసారి కొంత అమౌంటు కూడా మ్యూచువల్ ఫండ్లలో ఇన్వెస్ట్ చేయొచ్చు.