Business Idea: ఈ మూడు రకాల చెట్లను పెంచితే.. మీరు కోటీశ్వరులు అవ్వడం ఖాయం..!!

  • Written By:
  • Updated On - November 16, 2022 / 10:31 AM IST

రైతులు లాభసాటి పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. తక్కువ ఖర్చు…ఎక్కువ ఆదాయం వచ్చే పంటలను సాగుచేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే చెట్ల పెంపకం ట్రెండ్ కూడా వేగంగా పెరిగింది. కేవలం చెట్ల పెంపకంతోనే రైతులు సుభిక్షంగా ఉన్నారనడానికి దేశంలోని ఎన్నో రాష్ట్రాల నుంచి ఉదాహరణలు తెరపైకి వచ్చాయి.

ముఖ్యంగా రైతులు సఫేదా, టేకు, గంహర్ , మహోగని ఈ చెట్ల పెంపకం బాగా ప్రాచుర్యం పొందింది. ఈ చెట్లను తక్కువ ఖర్చుతోపాటు తక్కువగా సంరక్షణలో ఎన్నో లాభాలను పొందుతున్నారు. అయితే ఈ చెట్ల పెంపకానికి రైతులకు ఓపిక చాలా అవసరం. ఎందుకంటే ఓపిక లేకుంటే ఈ చెట్ల సాగు ప్రయోజనకరంగా ఉండదు.

యూకలిప్టస్ చెట్ల పెంపకం:
దీని కలపను ఫర్నిచర్,ఇంధనం, కాగితం గుజ్జు తయారీకి ఉపయోగిస్తారు. ఒక హెక్టార్ లో మూడు వేల యూకలిప్టస్ మొక్కలను నాటవచ్చు. ఈ చెట్టు ఐదేళ్లలో బాగా పెరుగుుతంది. తర్వాత దానికి నరికివేయవచ్చు. ఒక ఎకరాలో సాగు చేయడం ద్వారా రైతు సులభంగా 70లక్షల నుంచి కోటి రూపాయల వరకు లాభం పొందవచ్చు.

మహోగని చెట్ల పెంపకం:
ఈ చెట్టు పెరగడానికి పుష్కరకాలం పడుతుంది. దాని చెక్క నుంచి ఆకులు, తొక్కలు ఎన్నో రకాల వ్యాధులకు ఔషధంగా ఉపయోగిస్తారు. దీని నుంచి వచ్చే గింజలు, నూనె దోమల నివారణ ఉత్పత్తులు, పురుగులమందు తయారీకి ఉపయోగిస్తారు. దీని విత్తనాలు కిలో వెయ్యి రూపాయలకు మార్కెట్లో దొరకుతాయి.

టేకు చెట్ల సాగు
టేకు చెట్ల సాగు కూడా 12ఏళ్లలో కోతకు వస్తుంది. 1 టేకు చెట్టు కోసిన తర్వాత మళ్లీ చిగురు వస్తుంది. ఒక ఎకరంలో 5వందల టేకు చెట్లు నాటితే 12ఏళ్ల తర్వాత కోట్లకు పడగలెత్తుతుంది.