Site icon HashtagU Telugu

More Sleep More Sex: నిద్ర తక్కువైతే.. సెక్స్ సామార్థ్యం తగ్గుతుందట!

more sleep, more sex

Sex

నిద్రలేమి (Less Sleep) అనేది కేవలం శారీరానికి మాత్రమే సంబంధించిన విషయం కాదు. ఇది జీవితంలో ప్రతిదానికీ భంగం కలిగిస్తుంది. మంచి నిద్ర సరైన లైంగిక (Sexual) ఫాంటసీని ఇస్తుంది. భాగస్వామితో గొప్ప సమయాన్ని గడపడానికి ప్రేరణనిస్తుంది. ఓ స్టడీ ప్రకారం రోజుకు 5 గంటల కంటే తక్కువ సమయం నిద్రపోయే పురుషులు వారి శరీరంలో 10% టెస్టోస్టెరాన్‌ను కోల్పోతారని తేలింది. మహిళల విషయంలోనూ అదే పరిస్థితి. బాగా నిద్రపోయినప్పుడు, వారు 14% మెరుగైన లైంగిక (Sexual) కోరికను ప్రదర్శిస్తారు.

నిద్ర నేరుగా సంతోషకరమైన హార్మోన్లతో ముడిపడి ఉంటుంది. ఒంటరిగా నిద్రపోయే వారి కంటే తమ భాగస్వాములతో కలిసి నిద్రించేవారు మంచిగా నిద్రపోతారని పలు జంటలు (Couples) కూడా స్పష్టం చేశాయి. అంతేకాదు గురక లాంటి సమస్యలను దూరం చేస్తోంది. భాగస్వాములు (భార్య లేదా భర్త) ఒకరు ఆలస్యంగా నిద్రపోతారు. మరొకరు ముందుగానే మేల్కొంటారు. కానీ అలాంటివాళ్లు లైంగిక జీవితంలో పలు ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉంటుందట. మంచి నిద్ర లైంగిక (Sexual) జీవితం పై ప్రభావం చూపి మంచి సంబంధాలకు దారితీస్తుంది.

నిద్ర తక్కువ అయితే కలిగే నష్టాలు

1. బలహీనమైన జీవక్రియ మంచి నిద్ర లేకపోవడం వల్ల జీవక్రియ బలహీనపడటం ప్రారంభమవుతుంది. ఇది అన్ని సమయాలలో అలసట, మలబద్ధకానికి దారితీస్తుంది. దీని కారణంగా బరువు పెరగుతారు. కాబట్టి మంచి నిద్ర పొందడానికి ప్రయత్నించండి.

2. ఆకలి పెరుగుతుంది నిద్ర లేకపోవడం వల్ల లేదా తక్కువ నిద్ర వల్ల శరీరంలో గ్రెలిన్ హార్మోన్ పెరుగుతుంది. దీని వల్ల బరువు పెరుగుతారు. గ్రెలిన్ హార్మోన్ ఆకలిని పెంచుతుంది. ఇది నిద్ర రాకుండా చేస్తుంది. కాబట్టి విపరీతంగా బరువు పెరుగుతారు.

3. వ్యాయామం మంచి నిద్ర లేకపోతే మరుసటి రోజు వ్యాయామం చేయలేరు. ఇది మన బరువు పెరగడానికి ఒక కారణం. ఈ పరిస్థితిలో మనం నీరసంగా లేదా అలసటగా ఉంటాం. సరైన శక్తితో కూడిన ఆహారాన్ని తీసుకోవాలి.

4. అలసట డీప్ స్లీపర్‌లు మరుసటి రోజు చురుకుగా, రిఫ్రెష్‌గా ఉంటారు. అయితే మీరు సరిగ్గా నిద్రపోకపోతే రోజంతా బద్ధకంగా, అలసిపోయినట్లు అనిపిస్తుంది. దీని కారణంగా మీ క్యాలరీ బర్న్ తక్కువగా ఉంటుంది. ఈ సందర్భంలో బరువు పెరుగుతారు.

Also Read: Pooja Hegde: హాట్ లుక్స్ లో హాలీవుడ్ హీరోయిన్ లా పూజా హెగ్డే!