India vs Pak War: ఈనెల (ఏప్రిల్) 1వ తేదీన బార్డర్‌లో ఉద్రిక్తత ఏర్పడింది. జమ్మూకశ్మీర్‌లోని నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ)ను దాటి పాకిస్తాన్ ఆర్మీ చొరబాటుకు యత్నించింది. దీంతో భారత ఆర్మీ భీకర కాల్పులు జరిపింది. ఈ ఘటనలో ఇద్దరు పాక్ సైనికులు హతమయ్యారు. ఒకవేళ ఇప్పటికిప్పుడు భారత్-పాక్ మధ్య యుద్ధమే జరిగితే.. ఏమవుతుంది ? ఎవరు గెలుస్తారు ? ఎవరు ఓడుతారు ? ఎవరి బలం ఎంత ?
Also Read :Maoists Letter : రేణుక ఎన్‌కౌంటర్.. కీలక వివరాలతో మావోయిస్టుల లేఖ
భారత, పాక్ ఆర్మీల లెక్కలివీ
- భారత ఆర్మీలో దాదాపు 25 లక్షల మంది సైన్యం ఉన్నారు. వీరిలో 14 లక్షల మంది యాక్టివ్‌గా ఉండగా, 12 లక్షల మంది రిజర్వ్‌లో ఉన్నారు.
- పాకిస్తాన్ ఆర్మీలో 6.5 లక్షల మంది యాక్టివ్ సైనికులు ఉన్నారు. దానికి 5 లక్షల మంది రిజర్వ్ సైనికులు కూడా ఉన్నారు.
- రిజర్వ్ సైనికులు సైన్యం ఆదేశించినప్పుడు మాత్రమే యుద్ధభూమిలోకి దిగుతారు.
- సైనికుల సంఖ్య పరంగా భారత్‌దే పైచేయి. అయితే పాకిస్తాన్ ఆర్మీ తక్కువ సైనికులతో ఎక్కువ రక్షణాత్మక వ్యూహాలపై ఆధారపడి పనిచేస్తుంది.
- భారత ఆర్మీ మొత్తం 14 కార్ప్స్‌లుగా విభజితమై ఉంది. 40 డివిజన్లలో ఇన్‌ఫాంట్రీ, ఆర్మర్డ్, మౌంటైన్ విభాగాలు ఉన్నాయి.
- పాకిస్తాన్ ఆర్మీ వార్షిక రక్షణ వ్యయం రూ.2 లక్షల కోట్లు.
- భారత ఆర్మీ వార్షిక రక్షణ వ్యయం రూ.7 లక్షల కోట్లు.
భారత్, పాక్ అణుబాంబులు
- భారత్ వద్ద దాదాపు 200కుపైగా అణ్వస్త్ర వార్‌హెడ్‌లు(India vs Pak War) ఉన్నట్లు అంచనా.
- పాకిస్తాన్ వద్ద దాదాపు 180కుపైగా అణ్వస్త్ర వార్‌హెడ్‌లు ఉన్నట్లు అంచనా.
- పాకిస్తాన్ మిత్రదేశం చైనా వద్ద 500కుపైగా అణ్వస్త్ర వార్‌హెడ్‌లు ఉన్నాయి.
- భారత్ మిత్రదేశం రష్యా వద్ద 6వేలకుపైగా అణ్వస్త్ర వార్‌హెడ్‌లు ఉన్నాయి.
- ఏ సమయంలో ఎలా వ్యవహరిస్తుందో తెలియని అమెరికా వద్ద 5వేలకుపైగా అణ్వస్త్ర వార్‌హెడ్‌లు ఉన్నాయి.
పాకిస్తాన్ బలహీనతలు
- చిన్నపాటి యుద్ధం జరిగితే భారత్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
- ఎక్కువ ఏళ్లపాటు యుద్ధం జరిగితే, రహస్యంగా పాకిస్తాన్‌కు చైనా నుంచి ఆయుధ సహకారం అందే అవకాశాలు ఉంటాయి.
- దీర్ఘకాలిక యుద్ధం చేసే ఆర్థిక సామర్థ్యం ప్రస్తుతం పాకిస్తాన్‌కు లేదు.
- పాకిస్తాన్ ఆర్మీలో ఐక్యత లేదు. ఆ దేశ ఆర్మీకి రాజకీయ పార్టీల మద్దతులేదు. ఇది నెగెటివ్‌గా పనిచేసే అవకాశం ఉంది.
- ఆర్థిక సవాళ్ల కారణంగా చాలా ఆయుధ వ్యవస్థలను పాకిస్తాన్ ఇంకా అప్‌గ్రేడ్ చేసుకోలేదు.
- పాక్ వద్ద ఆధునిక ఇన్‌ఫాంట్రీ వాహనాలు తక్కువ సంఖ్యలో ఉన్నాయి.
- యుద్ధం వంటి అత్యవసర సమయాల్లో పాకిస్తాన్‌కు సాయం చేసే దేశం చైనా మాత్రమే.
భారత్ బలాలు, బలహీనతలు
- భారత ఆర్మీ ఆధునిక యుద్ధ సామగ్రిని కలిగి ఉంది.
- 4,600 యుద్ద ట్యాంకులు (టి-90, అర్జున్), 10,000 ఆర్టిలరీ గన్స్ (భోఫోర్స్, ధనుష్), బ్రహ్మోస్, అగ్ని-5 వంటి మిస్సైళ్లు ఉన్నాయి.
- భారత ఆర్మీకి రష్యా, అమెరికా, ఫ్రాన్స్ దేశాల సాంకేతిక సహకారం ఉంది. పాక్‌తో యుద్ధం వస్తే ఈ దేశాల నుంచి భారత్‌కు ఆయుధ సామగ్రి పరమైన సహకారం లభిస్తుంది.
- మిగ్-21 వంటి పాత తరం విమానాలను కలిగి ఉండడం భారత్ బలహీనత.
- 42 స్క్వాడ్రన్ జెట్స్ అవసరం ఉండగా 31 మాత్రమే భారత్ వద్ద ఉన్నాయి.
- పాకిస్తాన్‌తో యుద్ధం చేసే క్రమంలో .. మరోవైపు చైనా సరిహద్దు నుంచి కూడా భారత్‌కు ముప్పు రావచ్చు.