OYO Hotels 2023: హైదరాబాద్ ఐటీ పరంగానే కాకుండా ఇతర ఆర్థిక వ్యవహరాల్లో దూసుకుపోతోంది. ఇప్పటికే సేఫ్ సిటీ, బెస్ట్ లివింగ్ డెస్టినేషన్ గా హైదరాబాద్ కు మంచి పేరుంది. ఈ కారణంతోనే మనదేశస్తులే కాకుండా విదేశీవాళ్లు సైతం ఇక్కడికి తరచుగా వస్తుంటారు. ఈ క్రమంలో ఓయో హోటల్స్ కు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ఓయో హోటల్స్ అండ్ హోమ్స్, ట్రావెలోపీడియా 2023 నివేదిక ప్రకారం.. 2023లో భారతదేశంలో అత్యధికంగా బుక్ చేసుకున్న నగరంగా హైదరాబాద్ నిలిచింది.
జాబితాలో బెంగళూరు రెండో స్థానంలో నిలిచింది. సంవత్సరంలో అత్యధికంగా సందర్శించిన రాష్ట్రం ఉత్తరప్రదేశ్ అని, మహారాష్ట్ర, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయని నివేదిక వెల్లడించింది. హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ మరియు కోల్‌కతా భారతదేశంలో అత్యధికంగా బుక్ చేయబడిన నాలుగు నగరాలుగా నిలిచాయి.
చిన్న పట్టణాలు కూడా సంవత్సరానికి వృద్ధిని సాధించాయని OYO హోటల్స్ అండ్ హోమ్స్ నివేదికలో వెల్లడించింది. ఇంతలో, జైపూర్ 2023లో అత్యధికంగా సందర్శించబడిన నగరంగా నమోదు చేయబడింది. తర్వాత గోవా, మైసూర్, పుదుచ్చేరి ఉన్నాయి. 2012లో స్థాపించబడిన OYO హోటల్స్ అండ్ హోమ్స్ అనేది భారతదేశం అంతటా హోటళ్లు, గృహాలు, నివాస స్థలాలతో ఒప్పందం కుదుర్చుకొని సేవలను అందిస్తున్నాయి. ఇక ప్రేయసీ ప్రేమికులు కూడా ఓయోకు వెళ్తున్నట్లు తేలింది.