Site icon HashtagU Telugu

Haleem: ‘హైదరాబాద్ హౌజ్’ లో రంజాన్ స్పెషల్

haleem

haleem

రుచికరమైన డెక్కన్ వంటకాలకు పేరెన్నికగాంచిన “హైదరాబాద్ హౌజ్” రంజాన్ వేళ సరికొత్త రుచులను అందించేందుకు సిద్ధం అవుతోంది. నోరూరించే హలీమ్ తో పాటు మరెన్నో వెరైటీ వంటకాలను డోర్ డెలివరీ చేసేందుకు సమాయత్తం అయింది. రూ.1,000కి మించిన ఆర్డర్ల పై 10 శాతం దాకా రాయితీ ఇస్తామని ప్రకటించింది. బోన్ లెస్ మటన్ హలీమ్ ను రుచికరంగా తయారు చేయడంలో హైదరాబాద్ హౌజ్ కు మంచి పేరుంది. దీంతోపాటు రంజాన్ స్పెషల్ మెనూలో.. మటన్ షికంపూర్, మరగ్ సూప్, పాయా, ముర్గ్ మలయి కబాబ్, ఖుబాణీ కా మీఠా, షీర్ ఖుర్మా ఉన్నాయి. వీటికి అదనంగా రెగ్యులర్ మెనూలో దమ్ కా గోష్ట్, తలాహువా గోష్ట్, మిర్చి గోష్ట్, అచారీ ముర్గ్, దమ్ కా ముర్గ్, బగారా బైగన్, దివానీ హండి మొదలైనవి ఉన్నాయి.