Site icon HashtagU Telugu

EV charging: రైల్వే డివిజన్లలో ‘ఈ-ఛార్జింగ్’ పాయింట్స్!

Ev

Ev

రోజురోజుకూ ఎలక్ట్రానిక్ వాహనాల వాడకం పెరిగిపోతుండటంతో రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దక్షిణ మధ్య రైల్వే (SCR) సికింద్రాబాద్ డివిజన్ డివిజన్‌లోని 32 ప్రధాన రైల్వే స్టేషన్‌లలో ఈ-వెహికల్ కోసం ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటుచేసింది. రైలు స్టేషన్‌లో ఛార్జింగ్ కనెక్షన్‌లను ప్రవేశపెట్టడం వల్ల ఎలక్ట్రిక్ వాహనాల కు సౌకర్యంగా ఉంటుంది. అంతేకాదు.. ప్రయాణికులకు సేవలందించినట్టవుతుంది. పర్యావరణ పరిరక్షణ దిశగా అడుగులు వేస్తుండటంతో సికింద్రాబాద్ డివిజన్ అధికారులను దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ (ఇన్‌చార్జి) అరుణ్ కుమార్ జైన్ ప్రశంసించారు. పర్యావరణ పరిరక్షణకు పాటు పడటంతో పాటు వాహనదారుల కు మెరుగైన సేవలందించేందుకు రైల్వే శాఖ అడుగులు వేస్తోంది. అందులో భాగంగా ఈ ఛార్జింగ్ సేవలను అందుబాటులోకి తెచ్చింది.

Exit mobile version