Diamonds: కర్నూలు జిల్లాలో వజ్రాల వేట.. రాత్రికి రాత్రే కోటిశ్వరుడైన రైతు!

కర్నూలు జిల్లాలో వజ్రాల వేట మొదలైంది. తాజాగా ఓ రైతుకు వజ్రం దొరకడంతో రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు.

  • Written By:
  • Updated On - June 6, 2023 / 05:47 PM IST

వర్షాల కోసం రైతులు ఎదురుచూడటం చాలా కామన్. కానీ కర్నూలు జిల్లాకు చెందిన రైతులు మాత్రం ఎప్పుడు చినుకు పడుతుందా? అని కళ్లలో ఒత్తులేసి మరి ఎదురుచూస్తుంటారు. అయితే వాళ్లంతా ఎదురుచూసేది వర్షాల కోసమే అయినా.. దానికి వెనుక పెద్ద కథే ఉంది. ఎందుకో అంటారా.. అక్కడ వర్షాలు కురిస్తే వజ్రాలు లభిస్తాయి. అందుకే అక్కడి రైతులు పొలాల్లో వజ్రాల వేట కొనసాగిస్తుంటారు. ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాలోని పలు ప్రాంతాల్లో భూముల్లో దొరికిన వజ్రాలతో రైతులు కోటీశ్వరులయ్యారు.

గత నాలుగైదు రోజులుగా ఆంధ్రప్రదేశ్ లో వర్షాలు కురుస్తున్నాయి. వర్షం రాకతో బసినేపల్లిలో మరో వ్యక్తికి అదృష్టం కలిసొచ్చింది. పొలంలో కోట్లు విలువ చేసే వజ్రం లభ్యమైంది. ఆ వజ్రాన్ని అక్కడే వేలం పెట్టాడు. అక్కడే వేచి చూస్తున్న వ్యాపారికి అమ్మకానికి పెడితే.. దాన్ని 2 కోట్ల రూపాయలు పలికినట్లుగా తెలుస్తోంది. ఆ విషయం అందరికి తెలియడంతో జనాలు పొలాల్లో వాలిపోయారు. ప్రస్తుతం కర్నూలు జిల్లాలో చాలామంది రైతులు వజ్రాల వేట కొనసాగించడం హాట్ టాపిక్ గా మారింది.

వర్షాలు పడ్డప్పడు వెతికితే వజ్రాలు దొరుకుతాయని.. స్థానికులు ఏటా ఈ సమయంలో వెదుకు లాడుతుంటారు. కానీ అదృష్టం ఉంటే.. రాత్రికి రాత్రే కోటిశ్వరులై పోవచ్చున్నమాట. కర్నూలు జిల్లా శ్రీ కృష్ణ దేవరాయలు ఏలిన ప్రదేశం. అప్పటి కాలంలో వజ్రాలు రాసులుగా పోసి అమ్మవారి చెబుతుండేవారు. అప్పటి కాలంలోని వజ్రాలు భూముల్లో ఉండిపోయాయని అంటూ ఉంటారు. అలా వర్షాలు పడుతున్న కొద్దీ మట్టి పొరల్లో దాగిన ఎంతో విలువైన వజ్రాలు బయటపడతాయట. ప్రస్తుతం ఈ వార్త తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమవుతోంది.

Also Read: Amarnath Yatra: అమర్ నాథ్ యాత్రపై ఉగ్ర కుట్ర.. భద్రతా బలగాలు అలర్ట్