Site icon HashtagU Telugu

Google Vs Nvidia : గూగుల్‌ను మించిపోయిన ఒక కంపెనీ.. మార్కెట్ విలువ రూ.16వేల కోట్లు

Google Vs Nvidia

Google Vs Nvidia

Google Vs Nvidia : మార్కెట్ క్యాపిటలైజేషన్‌లో గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్‌ను ‘ఎన్‌విడియా’ కంపెనీ అధిగమించింది. అత్యుత్తమ ఫలితాల ప్రకటన, షేర్ల విలువ పెరగడంతో ఇది సాధ్యమైంది.  ప్రాసెసర్లు తయారు చేసే అమెరికన్ కంపెనీ ‘ఎన్‌విడియా’ మార్కెట్ విలువ రూ.16వేల కోట్లకు చేరుకుంది. ఇంతకుముందు అమెరికాలో టెక్ దిగ్గజాలు మైక్రోసాఫ్ట్, యాపిల్ మాత్రమే ఇంతటి రికార్డును సాధించాయి.  కాలిఫోర్నియా కేంద్రంగా పనిచేసే ‘ఎన్‌విడియా’ కంపెనీ  షేర్ల విలువ 2023లో మూడు రెట్లు పెరిగాయి. షేర్ల ధర  ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 60 శాతానికి మించి పెరిగాయి. శక్తివంతమైన గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిటన్లు తయా చేయడం ద్వారా చిప్స్ తయారీ రంగంలో రారాజులా ఎన్‌విడియా వెలుగొందుతోంది.

We’re now on WhatsApp. Click to Join

గణాంకాలను చాలా వేగంగా లెక్కించగల ఎలక్ట్రానిక్ సర్క్యూట్లను ఎన్‌విడియా(Google Vs Nvidia) తయారు చేస్తోంది. ఈ ప్రాసెసర్లను ఎక్కువగా అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగంలో ఉపయోగిస్తున్నారు. మార్కెట్‌లో వీటి విలువ ఒక్కొక్కటి వేల డాలర్లు పలుకుతోంది. ఈ ప్రాసెసర్లకు గిరాకీ ఏ విధంగా ఉందంటే, వాటిని వజ్రాలను తరలించినట్లుగా కట్టుదిట్టమైన భద్రత మధ్య ట్రక్కుల్లో తరలిస్తున్నారు. గ్రాఫిక్ ప్రాసెసర్ యూనిట్ల తయారీలో 80 శాతం మార్కెట్‌ను సంపాదించుకున్న ఇంటెల్, ఏఎండీ కంటే ఎన్‌విడియా అవకాశాలు పెరుగుతున్నాయి.

ఎన్‌విడియా కంపెనీ విశేషాలివీ.. 

  • 30 ఏళ్ల క్రితం వీడియో గేమ్స్‌లో ఉపయోగించే చిప్స్ తయారీ సంస్థగా ఎన్‌విడియా ప్రయాణం ప్రారంభమైంది.
  • గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ లాంటి దిగ్గజ సంస్థలు తమ వద్ద ఉన్న డేటాను భద్రపరిచేందుకు ఎన్‌విడియా తయారు చేస్తున్న ప్రాసెసర్ల అవసరాన్ని గుర్తించాయి. అలాగే క్రిప్టో కరెన్సీల మైనింగ్ చేసే సంస్థలకు కూడా ఇవి అవసరంగా మారాయి.
  • ఇంజనీర్లు కూడా తమ చిప్స్ ఉపయోగించి కృత్రిమ మేథస్సు సాయంతో గణాంకాల్ని వేగంగా సిద్ధం చేయడం కూడా ప్రారంభమైంది. దీంతో వారికి అవసరమైన లెక్కల్ని చేయడానికి ప్రాసెసర్ల అవసరం పెరిగింది.
  • ప్రస్తుతం అత్యాధునిక జీపీయూల తయారీలో ఎన్‌విడియా ముందుంది. అత్యాధునిక సాంకేతిక కృత్రిమ మేధలో ఈ సంస్థ తయారు చేసిన హెచ్ 100 ప్రాసెసర్లను ఉపయోగిస్తున్నారు.
  • దీంతో ప్రత్యర్థులైన ఏఎండీ, ఇంటెల్ లాంటి సంస్థలు అర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ రంగంలోకి అడుగు పెట్టకముందే నివిడియా ఆ మార్కెట్‌ మీద ఆధిపత్యం చలాయించడం మొదలైంది.
  • గూగుల్, అమెజాన్ , మైక్రోసాఫ్ట్ లాంటి సంస్థలు ఓ వైపు గ్రాఫిక్స్ ప్రాసెసర్ యూనిట్లను తయారు చేస్తూనే క్లౌడ్ కంప్యూటింగ్‌ను కూడా అభివృద్ధి చేశాయి. అర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కోసం తమదైన సొంత చిప్స్ తయారు చేయడం ప్రారంభించాయి.
Exit mobile version