Site icon HashtagU Telugu

Aadhar Update : ఆధార్ లో పుట్టిన తేదీని…ఎన్నిసార్లు సవరించవచ్చు.!!

Aadhaar Card

Aadhaar Card

ఆధార్…ఇప్పుడు అందరికీ ఇది ఆధారం. ప్రతిఒక్కరి గోప్యత కోసం ఇది తప్పనిసరి. ఆధార్ కార్డులో తప్పులు జరుగుతే…వాటిని సవరించుకునే అవకాశం ఉంటుంది. పేరు, పుట్టిన తేదీ, అడ్రెస్ వంటి వివరాలను సవరించుకునే సదుపాయం ఉంటుంది. కానీ కొన్ని విషయాల్లో పరిమితులు ఉన్నాయి. ఆధార్ లో ఏ వివరాలను సవరించాలన్నా…దానికి అనుబంధంగా నమోదు అయిన మొబైల్ నెంబర్ యాక్టివ్ లో ఉండాలి. మొబైల్ నెంబర్ మార్చితే…దాని ఆధార్ డేటాబేస్ లో తప్పనిసరిగా అప్ డేట్ చేసుకోవాలి.

సమీపంలోని ఆధార్ సెంటర్ కు వెళ్లి మీ మొబైల్ నెంబర్, ఈ మెయిల్ ఐడీని నమోదు చేసి ఇవ్వాలి. ఇది ఆన్ లైన్ ద్వారా అప్ డేట్ చేసుకునే వీలు లేదు. ఇక ఆధార్ నిబంధనల ప్రకారం ఫింగర్ ప్రింట్స్, కంటిపాపల అప్ డేషన్ను తప్పనిసరిగా సరిచేసుకోవాలి. అయితే ఇది ఆధార్ సెంటర్లలో ఫ్రీగా చేస్తారు. ఇక ఫింగర్ ప్రింట్ అప్ డేట్ చేసుకోవాలంటే వందరూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. పేరు , ఇతర వివరాల సవరణ కోసం రూ. 50 ఛార్జీ చెల్లించాలి.

పేరులో మార్పులు చేయాలంటే…
ఆధార్ కార్డులో కొంతమంది పేరు తప్పుగా నమోదు అవుతుంది. అయితే దాన్ని సవరించుకోవచ్చు. కానీ రెండు సార్లు మాత్రమే సవరించుకునే వీలు ఉంటుంది. రెండు సార్ల కంటే ఎక్కువ అయితే సవరించుకునేందుకు వీల్లేదు.

పుట్టినతేదీ అనేది ఆధార్ లో చాలా కీలకమైంది. ఒకసారి మాత్రమే డేట్ ఆఫ్ బర్త్ లో మార్పులకు అనుమతిస్తారు. రెండోసారి మార్పు కావాలంటే అసాధారణకేసుగా పరిగణిస్తారు. అయితే రెండోసారి పుట్టిన తేదీలో మార్పులు చేసుకోవాలంటే మీకు దగ్గరలో ఉన్న ఆధార్ కేంద్రానికి వెళ్లి ఒక దరఖాస్తు పెట్టుకోవాలి. ఆ తర్వాత రీజినల్ ఆఫీస్ కు వెళ్లి అనుమతి తీసుకోవాలి. కార్డు హెల్డర్ చెప్పే వివరాలు.. ఆధారలు సరిపోతే…సవరణ అభ్యర్థనకు ఆమోదిస్తారు. పుట్టినతేదీతోపాటుగా స్త్రీ, పురుష లింగమార్పు వివరాల్లో తప్పుదొర్లినట్లయితే…ఒకసారి మాత్రమే సవరణకు UIDAIఅనుమతి ఇస్తుంది. రెండోసారి సవరణ కోరితే పుట్టినతేదీ లో చెప్పిన విధంగా ప్రక్రియ అనుసరించాలి.

Exit mobile version