Ants On Earth: 20,000,000,000,000,000.. ఇది మన భూమిపైనున్న చీమల సంఖ్య!!

ఆకాశంపై చుక్కల్ని.. భూమిపై చీమల్ని లెక్కపెట్టడం దాదాపు అసాధ్యం.

  • Written By:
  • Publish Date - September 21, 2022 / 07:15 AM IST

ఆకాశంపై చుక్కల్ని.. భూమిపై చీమల్ని లెక్కపెట్టడం దాదాపు అసాధ్యం.

అయితే వీటిలో ఒక అసాధ్యాన్ని హాంకాంగ్‌కు చెందిన కొందరు పరిశోధకులు సుసాధ్యం చేసే ప్రయత్నం చేశారు.

భూమిపై 20,000, 000, 000, 000,000 లేదా 20 క్వాడ్రిలియన్ల చీమలు ఉన్నాయని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. కానీ వాటి సాంద్రత (డెన్సిటీ) భారీగా ఉన్న దృష్ట్యా కచ్చితమైన సంఖ్యను మాత్రం చెప్పలేకపోతున్నామని తెలిపారు. గతంలో జరిగిన దాదాపు 489 అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం ద్వారా ఈ విషయంపై అంచనాకు వచ్చామని వెల్లడించారు. భూగోళం మీద చీమల బరువు (బయోమాస్‌) కూడా 12 మిలియన్ టన్నులని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అడవుల్లో నివసించే పక్షులు, క్షీరదాల మొత్తం బరువు కలిపి సుమారు 2 మిలియన్ టన్నులు ఉంటుందని తెలిపారు.ఈ పరిశోధన వివరాలు “నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రొసీడింగ్స్” జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.