Internet Voting : ప్రస్తుతం మన దేశంలో ఎన్నికల ప్రక్రియ కోసం ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల(ఈవీఎం)ను వాడుతున్నాం. కాంగ్రెస్ సహా పలు ప్రతిపక్ష పార్టీలు ఈవీఎంలపై సందేహాలు వెలిబుచ్చుతున్నాయి. వాటిని హ్యాక్ చేసే అవకాశాలు ఉంటాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈనేపథ్యంలో ఈవీఎం పద్ధతిని మించిన మరో ఎన్నికల నిర్వహణ టెక్నాలజీపై ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అదే.. ఇంటర్నెట్ ఓటింగ్ (ఈ – ఓటింగ్). భవిష్యత్తు అంతా ‘ఇంటర్నెట్ ఓటింగ్’దే(Internet Voting) అని గతంలో చెప్పుకునేవారు. కానీ ప్రస్తుతం మనం 2024లో ఉన్నా చాలా దేశాలు ఆ పద్ధతిని వాడేందుకు సిద్ధంగా లేవు. నూటికి నూరు శాతం ఆ ఓటింగ్ సాంకేతికతపై నమ్మకం లేకపోవడం వల్లే దాన్ని వాడటం లేదని పరిశీలకులు అంటున్నారు.
We’re now on WhatsApp. Click to Join
ఈ-ఓటింగ్ అంటే ఏమిటి ?
1982 సంవత్సరంలోనే కేరళ స్థానిక సంస్థల ఎన్నికలలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ పద్ధతిని ప్రయోగాత్మకంగా ప్రవేశ పెట్టారు. అయితే చట్టపరమైన సమస్యల కారణంగా దీన్ని రద్దు చేశారు. ఆ వెంటనే అక్కడ బ్యాలట్ పద్ధతిని అమల్లోకి తెచ్చారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్‌లను ఉపయోగించడం అనేది ఇంటర్నెట్ ఓటింగ్ వైపుగా ఒక అడుగు అని పరిశీలకులు అంటున్నారు. ఇంటర్నెట్ ఓటింగ్ కోసం మనం పోలింగ్ కేంద్రానికి పోవాల్సిన అవసరం ఉండదు. ఆన్‌లైన్‌లో మనం ఎక్కడి నుంచైనా ఓటు వేయొచ్చు.
Also Read : Attack on Dastagiri Father : దస్తగిరి తండ్రిపై దాడి
ఎస్టోనియా దేశం ముందడుగు
ఎస్టోనియా దేశం 2005 సంవత్సరం నుంచే ఆన్‌లైన్ పోలింగ్ నిర్వహిస్తోంది. ఎస్టోనియా దేశం తన ఇంటర్నెట్ ఓటింగ్‌ను అప్‌గ్రేడ్ చేయడంలో నిరంతరం పని చేస్తోంది. సాఫ్ట్‌వేర్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తోంది. 2022 సంవత్సరంలో ఎస్టోనియా ప్రభుత్వం తమ డిజిటల్ సమాచార వ్యవస్థలకు 30 మిలియన్ల యూరోలను కేటాయించింది. ఈ రోజు వరకు ఈ దేశం ఎన్నికల సమయంలో ఎన్నడూ మాల్వేర్ వంటివి గుర్తించలేదు. గత సంవత్సరం మొదటిసారిగా కేవలం సగం మంది ఎస్టోనియన్లు తమ బ్యాలెట్లను ఆన్‌లైన్‌లో వేశారు, అయితే, కేవలం 3 లక్షల మంది పౌరులు ఎన్నికల్లో ఇంటర్నెట్‌ని ఉపయోగించడానికి దాదాపు ముప్పై సంవత్సరాలు పట్టడం గమనార్హం.
Also Read : Salary Hike : బ్యాంకు ఉద్యోగులకు 17 శాతం జీతం పెంపు.. త్వరలోనే మరో శుభవార్త
స్విట్జర్లాండ్‌లో అలా జరిగింది..
స్విట్జర్లాండ్‌లోని కొన్ని ప్రాంతాలు 2004లో ఇంటర్నెట్ ఓటింగ్‌ను స్వీకరించాయి. అయితే పదిహేనేళ్ల తర్వాత, పబ్లిక్ టెస్టింగ్ నవీకరించిన సాఫ్ట్‌వేర్‌లో లోపాలు బయటపడ్డాయి. దీంతో ఆన్‌లైన్ ఓటింగ్ అమలును 2023 మార్చి లో నిలిపివేశారు. ఇక త్వరలో కొన్ని దేశాలు ఈ-ఓటింగ్‌కు మారుతున్నాయి. కొంతమంది రష్యన్లు తమ అధ్యక్షుడిని మార్చి మధ్యలో మొదటిసారిగా ఎలక్ట్రానిక్ సిస్టమ్‌లో ఎన్నుకోనున్నారు. నార్వే, మెక్సికో వంటి ఇతర దేశాలు.. రాబోయే జూన్ లో జరగనున్న అధ్యక్ష ఎన్నికలలో విదేశాల్లో నివసిస్తున్న పౌరులకు ఎలక్ట్రానిక్ ఓటింగ్‌ను అనుమతించనున్నాయి.