Site icon HashtagU Telugu

Viral Pic of Hijab: ఈ చిత్రం దేశ ఐక్యతకు స్ఫూర్తి!

Hijab

Hijab

కర్నాటక అంతటా హిజాబ్ వివాదం నెలకొంది. మొదట కర్నాటకే పరిమితమైన ఈ వివాదం దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాలకు పాకింది. కొందరు ‘హిజాబ్’ ను వ్యతిరేకిస్తే, మరికొందరు స్వాగతించారు. ఈ నేపథ్యంలో కర్ణాటకలోని ఓ ఫొటో ఎంతోమందిని ఆలోజింపచేస్తోంది. దేశవ్యాప్తంగా ఎందరినీ ఆకట్టుకుంది. హిజాబ్ వివాదం ముదురుతున్న సమయంలో ఈ చిత్రం దేశ యూనిటీకి చిహ్నంగా నిలుస్తోంది. గత పదిరోజుల క్రితం ఉడిపి గవర్నమెంట్ ప్రీ-యూనివర్సిటీ కాలేజ్ ఫర్ గర్ల్స్ వారం రోజుల పాటు మూసివేసింది. ఆ తర్వాత పున: ప్రారంభించినప్పుడు హిందు అమ్మాయిలతో ఓ మైనార్టీ స్టూడెంట్ కలిసి భుజాన బ్యాగులు వేసుకొని కళాశాలకు వెళ్తున్నారు. హిజాబ్ ధరించిన అమ్మాయికి రక్షణ కవచంగా నిలిచారు కొందరు. గట్టిగా చేతులు పట్టుకుని కళాశాల వైపు నడుస్తున్నట్లు ఈ చిత్రంలో చూడొచ్చు. ఇర్షాద్ అనే ఫొటోగ్రాఫర్ క్లిక్ అనిపించిన ఈ ఫొటో దేశవ్యాప్తంగా వైరల్ అయ్యింది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సైతం తన ట్విట్టర్ లో షేర్ చేశారు.