Site icon HashtagU Telugu

Building Of Dead : చనిపోయిన వారి కోసం 12 అంతస్తుల బిల్డింగ్

Building Of Dead

Building Of Dead

Building Of Dead : హాంకాంగ్ లో 12 అంతస్తుల గ్రాండ్ బిల్డింగ్ కట్టారు.. 

అదేదో ఫైవ్ స్టార్ హోటల్ అనుకుంటే తప్పులో కాలేసినట్టే.. 

చనిపోయిన వారి చితా భస్మాన్ని(బూడిద) లాకర్లలో భద్రంగా దాచిపెట్టేందుకు ఈ బిల్డింగ్ కట్టారు.. 

ఇంతకీ ఇలాంటి బిల్డింగ్స్ కట్టాల్సిన అవసరం ఎందుకు ఏర్పడింది ? 

చనిపోయిన వారి చితాభస్మాన్ని లాకర్లలో దాచే  ఈ బిల్డింగ్ పేరు “షన్ సమ్ కొలంబేరియం” (Shan Sum columbarium). 12 అంతస్తుల ఈ ఎకో ఫ్రెండ్లీ  భవనంలో 23,000 లాకర్లు ఉన్నాయి. పూర్తిగా ఎయిర్ కండిషన్డ్ బిల్డింగ్ ఇది.  బూడిదను దాచే లాకర్లను చాలా అందంగా డెకొరేట్ చేసి నిర్మించారు. లాకర్ల లోపల అట్రాక్టివ్ లైటింగ్ ఏర్పాట్లు చేశారు.  ఒక్కో లాకర్ సగటున 26× 34 సెంటీమీటర్ల సైజులో ఉంటుంది. ఇంకా పెద్ద సైజు లాకర్లు కూడా ఉన్నాయి. హాంకాంగ్ ఖరీదైన నగరం. అక్కడ ఇంటి అద్దెలు హై రేంజ్ లో ఉంటాయి.  షన్ సమ్ కొలంబేరియంలో ఉన్న లాకర్ల రెంట్ కూడా ఎక్కువే. ఇద్దరు వ్యక్తుల బూడిద పెట్టెలకు సరిపడా లాకర్ ను తీసుకోవాలంటే  అర కోటి రూపాయలు (రూ.50 లక్షలు) కట్టాల్సి ఉంటుంది. మొత్తం ఫ్యామిలీ కోసం పెద్ద లాకర్ ను తీసుకోవాలని భావిస్తే.. రూ.24 కోట్లు పే చేయాలి.  అందుకే షన్ సమ్ కొలంబేరియం(Building Of Dead) హాంకాంగ్ లోని అత్యంత ధనిక వర్గాలకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.

Also read : Candy Crush: 3 గంటల్లోనే 35 లక్షల డౌన్‌లోడ్ లు.. ఎంఎస్ ధోనీ అంటే అంతే మరీ..!

స్థలం తక్కువ.. జనాభా ఎక్కువ

హాంకాంగ్ దేశ జనాభా 74 లక్షలు..  విస్తీర్ణం కేవలం 2755 చదరపు కిలోమీటర్లు. హైదరాబాద్ సిటీ  విస్తీర్ణం 650 చదరపు కిలోమీటర్లు.. అంటే మన భాగ్యనగరం కంటే  హాంకాంగ్ విస్తీర్ణం దాదాపు 4 రెట్లు మాత్రమే పెద్దది.  ప్రపంచంలో అత్యంత జనసాంద్రత కలిగిన ప్రాంతాలలో హాంకాంగ్ ఒకటి. ఈ కంట్రీలో ప్రతి చదరపు కిలోమీటరుకు 6,300 మంది నివసిస్తుంటారు. హాంకాంగ్ జనాభాలో 49 శాతం మంది చైనీస్ గ్రామీణ తెగల వారే ఉంటారు. 21 % మంది బౌద్ధులు, 14 %  మంది  టావోయిస్ట్‌లు, 11.8% మంది  క్రైస్తవులు, మిగితా 3.7% మందిలో  హిందువులు, సిక్కులు , యూదులు, ముస్లింలు ఉన్నారు.

ఎందుకు ఇలాంటి బిల్డింగ్స్ ?

1960వ దశకానికి ముందు వరకు  హాంకాంగ్ లో చనిపోయే వారిని భూమిలో ఖననం చేసే సంప్రదాయమే ఉండేది.  అయితే దేశంలో జనాభా వేగంగా పెరుగుతుండటం,  భూమి కొరత ఏర్పడుతున్నందున హాంకాంగ్ సర్కారు చనిపోయిన వారిని క్రెమెటోరియంలలో యంత్రాల ద్వారా దహనం చేయాలని నిర్దేశించింది. దీంతో హాంకాంగ్ లో శ్మశాన వాటికలకు కాలం చెల్లినట్టు అయింది. అంతకుముందు వరకు చనిపోయిన  తమ వారికి నివాళులు అర్పించేందుకు శ్మశాన వాటికలకు వెళ్లిన హాంకాంగ్ ప్రజలు.. మృతదేహాలను దహనం చేసే ట్రెండ్ మొదలైనప్పటి నుంచి చనిపోయిన వారి చితాభస్మాన్ని తెచ్చిఇండ్లలో  దాచుకోవడం మొదలుపెట్టారు. అయితే ఎక్కడ పడితే అక్కడ చితాభస్మాన్ని నిల్వ చేయడం అగౌరవంగా ఉంటుందని కొందరు భావించారు. అలాంటి వారి సౌకర్యార్ధం చనిపోయిన వాళ్ళ   చితాభస్మాలను దాచేందుకు కొన్ని ప్రతేక బిల్డింగ్ లు నిర్మితమయ్యాయి. “షన్ సమ్ కొలంబేరియం”  కూడా ఆ కోవలోకే వస్తుంది.