Site icon HashtagU Telugu

Kerala Women: గరిటె తిప్పగలరు.. జంతువులనూ కంట్రోల్ చేయగలరు, జూకీపర్లుగా కేరళ మహిళలు!

Zoo

Zoo

భారతీయ మహిళలు వంటిల్లు కుందేలు కాదని నిరూపిస్తున్నారు. ఒకవైపు గరిటే తిప్పుతూ, మరోవైపు కష్టసాధ్యమైన పనులను కూడా చేస్తున్నారు. తాజాగా కేరళలో మొట్టమొదటిసారిగా ఐదుగురు మహిళలను జూ లో కాపాలాదారులుగా నియమించారు. త్రిష్యూర్ లోని పుతూర్ జూలాజికల్ పార్కులో అటవీ శాఖాధికారులు ఈ నియామకాలు చేశారు. ప్రస్తుతం ఈ జూని కొత్తగా అభివృద్ధి పరుస్తున్నారు. కేరళలో మొట్టమొదటి మహిళా జూ కీపర్లుగా వీరు చరిత్ర సృష్టించనున్నారని అక్కడి అటవీశాఖాధికారులు తెలిపారు.

త్రిష్యూర్, తిరువనంతపురంలలో ఉన్న వందల ఏళ్లనాటి పాత జూలలో ఇప్పటివరకు మగవారే కీపర్లుగా పనిచేస్తున్నారు. రేష్మ, కష్టా కె చంద్రన్, శోబి, సాజీనా, నెషితా అనే అయిదుగురు మహిళలు… జూకీపర్లుగా పనిచేయటం మగవారికి మాత్రమే సాధ్యమనే అభిప్రాయం తప్పని నిరూపిస్తూ క్రూర మృగాల కాపలాదారులుగా విధుల్లో చేరారు.  జూ కీపర్లుగా శిక్షణ పొందిన ఈ అయిదుగురు మహిళలు జూ లో జంతువులను ఒకబోనునుండి మరొక బోనుకి యంత్రపరికరాల సహాయంతో మార్చడం, బోనులను శుభ్రం చేయటం, జంతువులకు తిండి పెట్టటం, వాటిని పరిశీలిస్తూ వాటి ఆరోగ్య పరిస్థితులను గమనించడం లాంటి విధులను నిర్వహించాల్సి ఉంటుంది.

పన్నెండేళ్ల వయసున్న వైగా అనే పులికి సంబంధించిన కార్యక్రమాలను ఈ మహిళలు తమ తోటి మగ ఉద్యోగులతో సమానంగా నిర్వర్తిస్తున్నారని అటవీ శాఖాధికారులు తెలిపారు. ఈ పులిని తిరువనంతపురం జూ నుండి త్రిష్యూర్ జూ కి తెప్పించారు. మరిన్ని జంతువులను ఇతర జూలనుండి ఇక్కడికి తెప్పించే ప్రయత్నాల్లో ఉన్నారు. తామందరికీ జంతువులంటే ప్రేమ ఉందని అందుకే ఈ అవకాశం వచ్చినప్పుడు ఆనందంగా ఉద్యోగాల్లో చేరామని ఈ మహిళలు అంటున్నారు.

Also Read: Pawan Kalyan: ప్రభాస్, మహేశ్ నాకంటే పెద్ద హీరోలు: పవన్ కామెంట్స్ వైరల్

Exit mobile version