Twitter New Logo History : ట్విట్టర్ కొత్త లోగో “ఎక్స్” ఎమోషనల్ హిస్టరీ.. హ్యాట్సాఫ్ ఎలాన్ మస్క్

Twitter New Logo History : ట్విట్టర్.. అనగానే ఒక బ్లూ బర్డ్ మనకు గుర్తుకు వస్తుంది. ఇదే మనందరి మెదళ్లలో నాటుకుపోయింది.. కళ్ళలో పాతుకుపోయింది..  ఇప్పుడు దీన్ని చెరిపేసి.. సింపుల్ గా 'X' అనే అక్షరంతో ట్విట్టర్ ను రీబ్రాండ్ చేయనున్నారు. 

Published By: HashtagU Telugu Desk
Twitter New Logo history

Twitter New Logo history

Twitter New Logo History : ట్విట్టర్.. అనగానే ఒక బ్లూ బర్డ్ మనకు గుర్తుకు వస్తుంది. 

ఇదే మనందరి మెదళ్లలో నాటుకుపోయింది.. కళ్ళలో పాతుకుపోయింది..  

ఇప్పుడు దీన్ని చెరిపేసి.. సింపుల్ గా ‘X’ అనే అక్షరంతో ట్విట్టర్ ను రీబ్రాండ్ చేయనున్నారు. 

ఈవిషయాన్ని తెలుపుతూ ట్విట్టర్ కొత్త యజమాని ఎలాన్ మస్క్ ఆదివారం ప్రకటించారు. 

అయితే తన కంపెనీ పేరులో  ‘X’ ఉండాలనే ఎలాన్ మస్క్  తపన,  డ్రీమ్ చాలా పాతది.. ఆ వివరాలివీ..

Also read : Fungal Infections: వర్షాకాలంలో చర్మంపై ఫంగల్ ఇన్ఫెక్షన్లు.. మీరు వీటి గురించి తెలుసుకోవాల్సిందే..!

ఎలాన్ మస్క్ కు ..  ‘X’ అనే అక్షరానికి ఉన్న సంబంధానికి 24 ఏళ్ళ హిస్టరీ ఉంది. దీని గురించి తెలుసుకోవాలంటే మనం 1990 సంవత్సరానికి వెళ్ళాలి. ఎలాన్ మస్క్ కెనడాలోని క్వీన్స్ యూనివర్సిటీలో  ఫిజిక్స్ లో పీజీ కోర్సు చేస్తున్న టైం అది. అప్పుడు ఎలాన్ మస్క్ తన సోదరుడు కింబాల్ తో కలిసి  బ్యాంక్ ఆఫ్ నోవా స్కోటియా ఉన్నత స్థాయి అధికారి పీటర్ నికల్సన్‌ ను కలిశాడు. ఆ అధికారి రికమెండేషన్ తో మస్క్ కు  బ్యాంక్ ఆఫ్ నోవా స్కోటియాలో సమ్మర్ ఇంటర్న్ షిప్ అవకాశం లభించింది. అక్కడ అతను గంటకు రూ.1100 ($14)  సంపాదించేవాడు. ఈ టైంలో బ్యాంకు ద్వారా బాండ్ల ట్రేడింగ్ చేసేందుకు సంబంధించిన ఒక కొత్త బిజినెస్ ఐడియా మస్క్ కు వచ్చింది. వెంటనే దానిపై ఒక రిపోర్ట్ తయారుచేసి బ్యాంక్  సీఈవో దగ్గరికి పంపాడు. కానీ ఆ బిజినెస్ ఐడియా  ప్రపోజల్ రిజెక్ట్ అయింది. అయినా మస్క్ బాధపడలేదు.

Also read : Harmanpreet Kaur: హ‌ర్మ‌న్‌ప్రీత్ కు బిగ్ షాక్.. మ్యాచ్ ఫీజులో భారీగా కోత

ఆన్‌లైన్ వార్తాపత్రికలకు వెబ్ మ్యాప్‌లు, వ్యాపార డైరెక్టరీలను అందించే Zip2 (జిప్ 2) అనే సంస్థను 1995లో మస్క్ స్థాపించాడు. జిప్2 సంస్థకు మంచి క్రేజ్ వచ్చిన తర్వాత ..  1999లో కంప్యూటర్ల  తయారీ కంపెనీ కాంపాక్ (Compaq)కు దాన్ని రూ.2500 కోట్లకు అమ్మేశాడు. ఎలాన్ మస్క్ సంపన్నుడిగా, సక్సెస్ ఫుల్ బిజినెస్ మ్యాన్ గా మారడానికి బీజాలు ఇక్కడే పడ్డాయి. ఈ డబ్బుతో అదే ఏడాది (1999లోనే)  X.com పేరుతో ఆన్‌లైన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీని మస్క్ ప్రారంభించాడు. 2000 సంవత్సరంలో పీటర్ థేల్ కు చెందిన “కన్ఫినిటీ”(Confinity) అనే సాఫ్ట్ వేర్ కంపెనీలో తన  X.comను కలిపేశాడు. అనంతరం వీరి జాయింట్ కంపెనీకి పే పాల్ (paypal) అనే పేరు పెట్టారు.

Also read : Viveka Murder Case: సిబిఐ డైరెక్టర్ కు అవినాష్ రెడ్డి లేఖ

PayPalను X-PayPalగా మార్చాలని ట్రై చేసి..

ఆన్‌లైన్‌లో డబ్బులను ఒక అకౌంట్ నుంచి మరో అకౌంట్ కు ట్రాన్స్ ఫర్ చేసే విషయంలో పే పాల్ ప్రపంచవ్యాప్తంగా ఎంతగా సక్సెస్ అయిందో మనకు తెలుసు. పే పాల్ నుంచి ఎలాన్ మస్క్ బాగా సంపాదించాడు. paypal పేరును  X-PayPalగా మార్చాలని తన బిజినెస్ పార్ట్నర్  పీటర్ థేల్ కు ఎలాన్ మస్క్ సూచించాడు. కానీ PayPal అప్పటికే ప్రపంచవ్యాప్తంగా విశ్వసనీయ బ్రాండ్ గా మారినందున పేరు మార్చేందుకు పీటర్ థేల్  నో చెప్పాడు. ఇప్పుడు ట్విట్టర్ ద్వారా తన చిరకాల  కోరికను ఎలాన్ మస్క్ తీర్చుకోబోతున్నాడు.  అతడి పట్టుదల, గోల్ తో ఎమోషనల్ అటాచ్మెంట్,  కెరీర్ లో అలుపెరుగని పోరాట స్ఫూర్తి ఈతరం ఎంట్రప్రెన్యూర్స్ కు ఆదర్శప్రాయం.

Also read : NPS: రోజుకు 100 రూపాయలు సేవ్ చేయండి.. నెలకు 57 వేల రూపాయల పెన్షన్ పొందండి..!

  Last Updated: 24 Jul 2023, 11:47 AM IST