Site icon HashtagU Telugu

Aadhaar Card: మీ ఆధార్ కార్డ్ హిస్టరీని ఇలా తనిఖీ చేయండి..!

Mobile Number With Aadhaar

Mobile Number With Aadhaar

మీరు బ్యాంకు ఖాతాను తెరవాలన్నా.. సిమ్ కార్డ్ కొనాలన్నా.. ఇలాంటివి ఎన్నో పనుల కోసం ఆధార్ కార్డు (Aadhaar Card) అవసరం. భారత విశిష్ట గుర్తింపు అథారిటీ (UIDAI) ఆధార్ కార్డులని దేశంలోని ప్రతి పౌరునికి జారీ చేస్తుంది. నేటి కాలంలో ఇది చాలా ముఖ్యమైన పత్రంగా కనిపిస్తుంది. ఇటువంటి పరిస్థితిలో అది పోయినా.. దొంగిలించబడినా, చాలా కష్టం అవుతుంది. అంతేకాదు.. మీ ఆధార్ కార్డు దుర్వినియోగం అవుతుందనే భయం కూడా ఉంటుంది. ఇలాంటి టైంలో ఇంట్లో కూర్చొని మీ ఆధార్ కార్డ్ ఎక్కడ ఉపయోగించబడిందో తెలుసుకోవచ్చు. అంటే దాని హిస్టరీని చెక్ చేసుకోవచ్చు. కాబట్టి దాని ప్రక్రియ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇదీ ప్రాసెస్

* మీ ఆధార్ కార్డ్ ఎక్కడ ఉపయోగించబడిందో కూడా తెలుసుకోవాలంటే.. మీరు ముందుగా UIDAI అధికారిక వెబ్‌సైట్ uidai.gov.inకి వెళ్లాలి.

* వెబ్‌సైట్‌లోకి వెళ్లిన తర్వాత.. మీరు ఇక్కడ ‘మై ఆధార్’ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

* ఇప్పుడు ‘ఆధార్ అథెంటికేషన్ హిస్టరీ’ ఎంపికపై క్లిక్ చేసి, మీ 12 అంకెల ఆధార్ నంబర్‌ను ఇక్కడ నమోదు చేయండి.

* ఆ తర్వాత స్క్రీన్‌పై కనిపించే క్యాప్చా కోడ్‌ను నమోదు చేయండి.

* తర్వాత OTP ధృవీకరణ ఎంపికపై క్లిక్ చేయండి.

* ఇప్పుడు మీరు ఆధార్ కార్డ్‌కి లింక్ చేసిన మొబైల్ నంబర్‌కు వన్ టైమ్ పాస్‌వర్డ్ (OTP) అందుకుంటారు.

* మీరు ఇక్కడ మొబైల్ నంబర్‌కు వచ్చిన ఈ OTPని పూరించాలి.

* అప్పుడు మీ ముందు ఒక ట్యాబ్ తెరవబడుతుంది. దీనిలో మీరు చరిత్రను తనిఖీ చేయాలనుకుంటున్న తేదీని నమోదు చేయాలి.

* దీని తర్వాత మీ ఆధార్ కార్డు ఏ రోజు ఎక్కడ, ఎక్కడ ఉపయోగించబడిందో తెలుసుకోవచ్చు.

* మీరు ఈ రికార్డును కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.