Site icon HashtagU Telugu

Tata Salt : టాటా సాల్ట్ అలా మొదలైందా..! వేస్ట్ అనుకున్నది సూపర్ ప్రాఫిట్స్ తెచ్చాయా..!

Here is The Back Story How TaTa Salt Introduced

Did Tata Salt Start Like That..! Waste Brought Super Profits..!

The Back Story of TATA Salt : టాటా కంపెనీ ఏం చేసినా ఆ బిజినెస్ స్ట్రాటజీ వేరే లెవెల్ లో ఉంటుంది. అందుకే ఏ రంగంలో అయినా టాటా నెంబర్ 1 ప్లేస్ లో ఉండటానికి ప్రయత్నిస్తుంది. టాటా నుంచి మన నిత్యావసర సరుకుల్లో వాడుకునే సాల్ట్ ప్రొడక్ట్ వస్తున్న విషయం తెలిసిందే. 1930 లో టాటా గ్రూప్ వారు టాటా కెమికల్స్ (TATA Chemicals) ని మొదలు పెట్టగా వారు సోడా యాష్ ని తయారు చేసేవారు. అయితే దీని కోసం ప్యూర్ వాటర్ కావాల్సి రావడంతో ఎంతో కష్టపడి అది సంపాదించే వారు.

ప్యూర్ వాటర్ కోసం సాల్ట్ వాటర్ ను తీసుకుని దాన్ని ప్యూరిఫై చేసి ప్యూర్ వాటర్ సేకరించే వారట. అయితే ఇలా చేయడం వల్ల దాని బై ప్రొడక్ట్ గా సాల్ట్ టన్నుల కొద్దీ స్టాక్ ఉండిపోయేదట. అలా వేస్ట్ అవుతున్న సాల్ట్ ని మరో ఆదాయ మార్గంగా మార్చుకున్నారు టాటా నిర్వాహకులు. అప్పటివరకు బ్రాండెడ్ సాల్ట్ మార్కెటర్స్ లేకపోవడంతో టాటా వాటర్ (TATA Water) ప్యూర్ చేయడంతో మిగిలిన సాల్ట్ ని టాటా సాల్ట్ (TATA Salt) అంటూ అమ్మడం మొదలు పెట్టారు.

1983 నుంచి టాటా సాల్ట్ లాంచ్ చేశారు. అనతి కాలంలోనే మార్కెట్ లో నెంబర్ 1 గా నిలిచింది టాటా సాల్ట్. ఐయోడైస్డ్ సాల్ట్ గా టాటా సాల్ట్ ఇప్పటికీ మార్కెట్ షేర్ లో 25 శాతం వరకు సంపాధిస్తుంది. సో వేస్ట్ అనుకున్న ఆ ప్రొడక్ట్ ని తమ మార్కెటింగ్ నాలెజ్డ్ తో కంపెనీకి సూపర్ ప్రాఫిట్స్ వచ్చేలా చేశారు. అయితే ప్యూరిఫై చేసిన తర్వాత వచ్చిన సాల్ట్ ని ఐయోడైస్డ్ గా సంబంధిత పరిశోధనలు చేశాకే మార్కెట్ లోకి విడుదల చేస్తారని తెలుస్తుంది. సో టాటా సాల్ట్ ఎలా మొదలైందో చూశారుగా దీని వెనక ఒక చిన్న ఐడియా ఆ కంపెనీకి భారీ మార్కెట్ షేర్ ని తెచ్చిపెట్టింది.

Also Read:  Viral : నడి రోడ్ ఫై అందరు చూస్తుండగా..బైక్ ఫై ముద్దులతో రెచ్చిపోయిన జంట