Diwali Amazing Facts : దీపావళిపై చారిత్రక, పౌరాణిక ఆధారాలు ఇవిగో..

Diwali Amazing Facts : నేడు వెలుగుల పండుగ దీపావళి. దీపావళి గురించి హిందూ మత గ్రంథాలు స్కంద పురాణం, అగ్ని పురాణంలలోనూ ప్రస్తావన ఉంది.

Published By: HashtagU Telugu Desk
Diwali Amazing Facts

Diwali Amazing Facts

Diwali Amazing Facts : నేడు వెలుగుల పండుగ దీపావళి. దీపావళి గురించి హిందూ మత గ్రంథాలు స్కంద పురాణం, అగ్ని పురాణంలలోనూ ప్రస్తావన ఉంది. స్కంద పురాణంలోని  కార్తీక మహాత్మ్యంలో శ్రీకృష్ణుడు.. దీపాలను సూర్యుడిలో ఒక భాగంగా వర్ణించి చెప్పారు. దీపావళితో ముడిపడిన కొన్ని శ్లోకాలు కూడా స్కంద పురాణంలో ఉన్నాయి. ద్వాపరయుగం నుంచి దీపావళిని జరుపుకునే సంప్రదాయం కొనసాగుతోందని పండితులు చెబుతుంటారు. అప్పట్లో దీపావళి పండుగను 5 రోజులు జరుపుకునేవారట. దీపావళి పండుగను సెలబ్రేట్ చేసుకోవడం దాదాపు 5వేల ఏళ్ల కిందట మొదలైంది. దీపావళి వేడుకల్లో ప్రధానంగా రెండు అంశాలు ఉన్నాయి. ఒకటి.. ఇంట్లో లక్ష్మీ పూజ, గణేశ పూజలను నిర్వహించడం. మరొకటి..  ఇళ్లలో దీపాలను వెలిగించడం, బాణసంచా కాల్చడం. అయితే  దీపాలు వెలిగించి, బాణసంచా కాల్చే సంప్రదాయం ఎప్పుడు మొదలైంది అనేందుకు కొన్ని చారిత్రక ఆధారాలు ఉన్నాయి.

We’re now on WhatsApp. Click to Join.

  • స్కంద పురాణంలో “మద్రాజ్యే యే దీపానాం భువి కుర్వంతి మానవః’’ అనే శ్లోకం ఉంది. ‘‘ఇంతకుముందు మద్రా రాష్ట్ర ప్రజలు దీపదానం చేశారు, దీపాలు వెలిగించారు’’ అని దీని అర్థం.  ఇందులో ప్రస్తావించిన మద్రా రాష్ట్రం ఇప్పుడు పాకిస్తాన్‌లోని తక్షశిలలో ఉంది.
  • రాక్షస రాజు బలి చక్రవర్తి దీపదానం మహిమ గురించి తెలుసుకున్న తర్వాత రాజ్యంలో దీపాలను వెలిగించే సంప్రదాయాన్ని ప్రారంభించాడని నమ్ముతారు.
  • సింధూ నాగరికత కాలానికి దాదాపు 5 వేల సంవత్సరాల క్రితమే మట్టి దీపాలను ఉపయోగించారనే ఆధారాలను పురాతత్వ శాస్త్రవేత్తలు గుర్తించారు.
  • సింధు లోయలోని మెహర్‌ఘర్‌లో జరిపిన తవ్వకాలలో పురావస్తు శాఖ బృందం పురాతన మట్టి దీపాలను కనుగొంది. వీటికి కార్బన్ డేటింగ్ నిర్వహించగా.. అవి సుమారు 5 వేల సంవత్సరాల కిందటివని తేలింది.
  • భారతదేశంలోని సంగల్‌లోనూ 2500 సంవత్సరాల క్రితం మౌర్యుల కాలంలో వాడిన దీపాలను పురావస్తు శాఖ గుర్తించింది.
  • 2396 సంవత్సరాల క్రితం కౌటిల్యుడు రచించిన అర్థశాస్త్రాన్ని చదివితే రాకెట్‌ను ఎప్పుడు ఉపయోగించారో తెలుస్తుంది.
  • కౌటిల్యుడి అర్థశాస్త్రంలోని 14వ అధ్యాయంలో ‘తేజాంచూర్ణం’ విధానం గురించి ప్రస్తావన ఉంది. తేజాన్‌ పౌడర్‌కు నిప్పంటించగానే నిప్పురవ్వలు ఎగిసిపడతాయని కౌటిల్యుడు వివరించారు. యుద్ధంలో శత్రువుల దృష్టిని మరల్చడానికి ‘తేజాంచూర్ణం’  కాలుస్తారని (Diwali Amazing Facts) పేర్కొన్నారు.

Also Read: PM Modi – Diwali : చైనా బార్డర్‌లో ఆర్మీ యూనిఫాంలో ప్రధాని మోడీ.. దీపావళికి రెడీ

  Last Updated: 12 Nov 2023, 12:12 PM IST