Site icon HashtagU Telugu

Sleeper Vande Bharat : వందే భారత్ స్లీపర్ ట్రైన్స్ వస్తున్నాయ్.. కంఫర్ట్ కు కేరాఫ్ అడ్రస్

Sleeper Vande Bharat

Sleeper Vande Bharat

Sleeper Vande Bharat :  వందే భారత్ స్లీపర్ ట్రైన్స్ రెడీ అవుతున్నాయి. ఈ రైళ్ల బోగీల డిజైనింగ్ ప్రక్రియ తుది దశకు చేరుకుంది.  రైలుకు సంబంధించిన ఒక డిజైన్ ను ఇప్పటికే భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ (BEML) ఖరారు చేసింది. దీనికి ఉన్నతాధికారుల ఆమోదం లభించగానే.. తయారీ ప్రక్రియ దిశగా అడుగులు పడనున్నాయి. ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF) కోసం భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ 10 స్లీపర్ వందే భారత్ రైళ్లను తయారు చేయనుంది. 2023 డిసెంబర్‌ నాటికి వందే భారత్ స్లీపర్ ట్రైన్ ప్రోటోటైప్ సిద్ధమవుతుందని, 2024 మార్చి నాటికి చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF) నుంచి మొట్టమొదటి రైైలు బయటకు వస్తుందని అంటున్నారు.

ఆ సంస్థల కన్సార్టియం

200 స్లీపర్ వందే భారత్ రైళ్ల తయారీకి టిటాఘర్ రైల్ సిస్టమ్స్ – రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్, భెల్ – టిటాఘర్ రైల్ సిస్టమ్స్  కన్సార్టియమ్‌లకు రైల్వే శాఖ కాంట్రాక్టు ఇచ్చింది. స్లీపర్ వందే భారత్ రైళ్లన్నీ ఒకే డిజైన్‌ను కలిగి ఉంటాయని, తుది డిజైన్‌ను రష్యా కంపెనీ ‘టీఎంహెచ్’, కోల్ కతాలోని టిటాఘర్ రైల్ సిస్టమ్స్ ఆమోదించనున్నాయని రైల్వే మంత్రి ఇప్పటికే వెల్లడించారు.

Also read : Bigg Boss 7 : నలుగురు అమ్మాయిలే ఎలిమినేట్.. ఏం జరుగుతుంది..?

వందే భారత్ స్లీపర్ ట్రైన్స్ లో మొత్తం 857 బెర్త్‌ లు ఉంటాయని చెబుతున్నారు. వీటిలో 823 బెర్త్‌లు ప్రయాణికుల కోసం,  34 బెర్త్‌లు సిబ్బందికి కేటాయిస్తారు. స్లీపర్ వందే భారత్‌లో మూడు టాయిలెట్లు మాత్రమే ఉంటాయి. ఒక మినీ ప్యాంట్రీ ఉంటుంది. వందే భారత్ స్లీపర్ ట్రైన్స్ నమూనా ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ ఫొటోల ప్రకారం.. వందేభారత్ స్లీపర్ ట్రైన్ లో లోయర్ బెర్త్, అప్పర్ బెర్తులు మాత్రమే ఉన్నాయి. మిడిల్ బెర్త్‌లు లేవు. పై బెర్త్‌ కు చేరుకోవడానికి వాడే నిచ్చెన కూడా సరికొత్త డిజైన్ లో(Sleeper Vande Bharat)  ఉంది.