Site icon HashtagU Telugu

Sakhi : ‘సఖి వన్ స్టాప్ సెంటర్’.. ఈ స్కీం గురించి తెలుసా ?

Sakhi One Stop Centre Scheme

Sakhi One Stop Centre Scheme

Sakhi : వేధింపులను ఎదుర్కొనే మహిళలకు అండగా నిలిచేందుకు ‘నిర్భయ ఫండ్‌’ నుంచి కేంద్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ ఓ స్కీమ్‌ను అమలు చేస్తోంది. దాని పేరే ‘సఖి వన్‌ స్టాప్ సెంటర్‌’ !! ఇందులో భాగంగా జిల్లా కేంద్రాల్లో సఖి వన్ స్టాప్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఐసీడీఎస్‌ పీడీ, సీడీపీవో, ఇతర అధికారులు ఆధ్వర్యంలో ఈ స్కీం అమలవుతుంటుంది. భర్త నుంచి, అత్తింటి కుటుంబ సభ్యుల నుంచి, ఇతర యువకుల నుంచి, ఆఫీసులో తోటి ఉద్యోగుల నుంచి వేధింపులను ఎదుర్కొనే మహిళలు సఖి కేంద్రాలను ఆశ్రయిస్తే అన్ని రకాల సహాయం చేస్తారు. ఈ కేంద్రాలలో కౌన్సిలర్‌, లీగల్‌ అడ్వైజర్‌, సోషల్‌ వర్కర్స్‌, సెంటర్‌ మేనేజర్‌ అందుబాటులో ఉంటారు.  వారు బాధిత మహిళలతో మాట్లాడి, వారి ఫిర్యాదులను నమోదు చేసుకుంటారు.

We’re now on WhatsApp. Click to Join

Also Read :Tamilisai : హైదరాబాద్ బీజేపీ పార్లమెంటు ఇన్‌ఛార్జిగా తమిళిసై

Also Read :YS Sharmila Vs YS Jagan : ఆ రెండు ‘బీ’ల చేతిలో సీఎం జగన్ రిమోట్ కంట్రోల్ : షర్మిల