Site icon HashtagU Telugu

Sabarimala Special Trains: అయ్యప్ప స్వాములకు గుడ్ న్యూస్.. శబరిమలకు ప్రత్యేక రైళ్లు

Ayyappa prasadam

Ayyappa Train

శబరిమల యాత్రికుల రద్దీని తగ్గించేందుకు దక్షిణ మధ్య రైల్వే (SCR) డిసెంబర్, జనవరి నెలల్లో 38 శబరిమల ప్రత్యేక రైళ్లను నడపనుంది. ఈ రైళ్లు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ రైల్వే స్టేషన్స్ నుంచి కేరళలోని కొల్లం, కొట్టాయం మధ్య నడపబడతాయి. రైల్వే శాఖ వివరాల ప్రకారం.. హైదరాబాద్ – కొల్లాం ప్రత్యేక రైళ్లు ప్రతి సోమవారం మరియు డిసెంబర్ 5, 12, 19, 26, జనవరి 2, 9, 16 తేదీలలో నడపబడతాయి. కొల్లాం, హైదరాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లు డిసెంబర్ 6, 13, 20 మరియు ప్రతి మంగళవారం నడుస్తాయి తరువాత జనవరి 3, 10, 17 తేదీల్లో నడుస్తాయి.

హైదరాబాద్ – కొల్లాం – హైదరాబాద్ ప్రత్యేక రైళ్లు సికింద్రాబాద్, నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, తిరుపతి, చిత్తూరు, కాట్పాడి, చివరిగా జోలార్‌పేటలో ఆగుతాయి. తిరుప్పూర్, కోయంబత్తూరు, పాల్‌ఘాట్, త్రిసూర్, అలువా, ఎర్నాకులం టౌన్, కొట్టాయం, చెంగనచేరి, తిరువళ్ల, చెంగన్నూర్, మావేలికెర, కాయంకుళం, సస్తాన్‌కోట స్టేషన్‌లు ఉన్నాయి. నర్సాపూర్ – కొట్టాయం ప్రత్యేక రైలు డిసెంబర్ 2, 9, 16, 30, జనవరి 6, 13 తేదీలలో అందుబాటులో ఉంటాయి. తిరుగు ప్రయాణంలో, ప్రత్యేక రైలు డిసెంబర్ 3, 10, 17, 31, జనవరి 7, 14 తేదీలలో నడుస్తుంది.

సికింద్రాబాద్, కొట్టాయం మధ్య ప్రత్యేక రైళ్లు డిసెంబర్ 4, 11, 18, 25, జనవరి 1, 8 మరియు ప్రతి ఆదివార౦ నడపబడతాయి. కొట్టాయం – సికింద్రాబాద్ ప్రత్యేక రైళ్లు డిసెంబర్ 5, 12, 19, 26, జనవరి 2, 9 మరియు ప్రతి సోమవారం తేదీలలో ట్రైన్స్ ఉంటాయి. ఈ రైళ్లలో 2AC, 3AC, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయి.