Gold Rate: గోల్డ్ @ 60,000.. రేటు ఇంకా పైకా? కిందకా?

బంగారం ధరలో స్వల్ప హెచ్చు తగ్గులు జరుగుతున్నాయి.. అయితే రేటు మాత్రం పైపైకే పోతోంది.10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.60 వేల దగ్గర్లో కదలాడుతోంది.

బంగారం ధరలో (Gold Rate) స్వల్ప హెచ్చు తగ్గులు జరుగుతున్నాయి.. అయితే రేటు మాత్రం పైపైకే పోతోంది.10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.60 వేల దగ్గర్లో కదలాడుతోంది. అమెరికాలో నెలకొన్న బ్యాంకింగ్‌ సంక్షోభ ప్రభావంతో అంతర్జాతీయంగా గోల్డ్ రేట్స్ (Gold Rate) పెరుగుతున్నాయి. ఆ సంక్షోభం ఇప్పట్లో సమసిపోయే ఛాన్స్ లేదు. దీంతో గోల్డ్ రేటు ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయని పరిశీలకులు అంటున్నారు.

వచ్చేవారంలో మరింత పైకి..

అమెరికా, యూరప్‌ బ్యాంకింగ్‌ వ్యవస్థను కమ్ముకున్న అనిశ్చితి మబ్బులు ఇప్పట్లో తొలిగేలా కన్పించడం లేదు. పైగా వచ్చే వారంలో అమెరికన్‌ సెంట్రల్‌ బ్యాంకైన ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్లను మరో 0.25 శాతం పెంచవచ్చన్న అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో ఔన్స్‌ గోల్డ్‌ వచ్చే వారంలో 2,000 మార్క్‌ను కూడా దాటి 2,030 డాలర్ల వరకు పెరగవచ్చని బులియన్‌ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఔన్స్‌ సిల్వర్‌ సైతం 23 – 24 డాలర్ల స్థాయిలో ట్రేడ్‌ కావచ్చని వారన్నారు. ఈ లెక్కన విలువైన లోహాలు దేశీయంగా మరింత ప్రియం కానున్నాయి.

తమిళనాడులో బంగారం ధరలు (Gold Rate) 60 వేల పైమాటే..

ఇక చెన్నై, కోయంబత్తూర్, మధురై, సేలం, వేలూరు, తిరునవ్వేలి, తిరుచ్చి, ఈ రోడ్ లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 60 వేలకు పైమాటే ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర తమిళనాడు రాష్ట్రంలోని ప్రధాన నగరాలలో 60 వేల 650 రూపాయల వద్ద కొనసాగుతుంది . 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం 55,600 రూపాయల వద్ద కొనసాగుతుంది. దేశంలోని వివిధ ప్రధాన నగరాలలో స్థానిక పన్నులను బట్టి బంగారం ధరలలో కొద్దిపాటి మార్పులు ఉంటాయి.

స్వతంత్ర భారతంలో ధరల గమనం సాగిందిలా..

1942లో క్విట్‌ ఇండియా ఉద్యమం పతాక స్థాయికి చేరిన సమయంలో 10 గ్రా ముల బంగారం సగటు ధర రూ.44గా ఉండేది. ఆ తర్వాత ఐదేళ్లలోనే ధర రెట్టింపై దేశానికి స్వాతంత్య్రం వచ్చే నాటికి రూ.88కి చేరుకుంది. అంటే, ఈ 75 ఏళ్ల స్వాతంత్య్ర భారతంలో బంగారం ధర దాదాపు 682 రెట్లు పెరిగింది.

సంవత్సరం – సగటుధర (రూ.)

1947 ౼ 88
1950 ౼ 100
1960 ౼ 112
1970 ౼ 184
1980 ౼ 1,330
1990 ౼ 3,200
2000 ౼ 4,400
2010 ౼ 18,500
2020 ౼ 42,700
2021 ౼ 48,700
2022 ౼ 52,700

Also Read:  Fire Boltt Terminator: రూ. 2 వేల కంటే తక్కువ ధరలో స్మార్ట్ వాచ్ కొనాలని ఉందా.. ఫైర్-బోల్ట్ టెర్మినేటర్ పై ఓ లుక్కేయండి..