Site icon HashtagU Telugu

Ganesh Mobile Immersion: ఇంటి వద్దనే గణేష్ నిమజ్జనాలు!

Ganesh

Ganesh

పర్యావరణ పరిరక్షణ చర్యల్లో భాగంగా, గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (GHMC) అధికారులు వినాయక నిమజ్జనాల కోసం ప్రత్యేక ఏర్పాటు చేస్తున్నారు. ‘ఫ్రీడమ్ గ్రూప్’ విగ్రహ నిమజ్జనం కోసం మొబైల్ చెరువులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆటో-ట్రాలీని కృత్రిమ చెరువుగా మార్చారు. ప్రజలు కోరితే..  వాహనం ఆయా ప్రదేశాలకు పంపబడుతాయి. “డోర్‌స్టెప్ వద్ద నిమజ్జనం చేయడం చాలా మంచి కార్యక్రమం.

నీటి వనరుల వద్ద విస్తృతమైన ఏర్పాట్లు చేసినప్పటికీ, ప్రజలు తమ ఇళ్ల సమీపంలో విగ్రహాలను నిమజ్జనం చేయాలనుకుంటే వారు ఫ్రీడమ్ గ్రూప్‌ను సంప్రదించవచ్చు ”అని మంత్రి  తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌, హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ, తెలంగాణ స్టేట్‌ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డ్‌ తదితర శాఖలు సుమారు ఆరు లక్షల మట్టి గణేష్‌ విగ్రహాలను పంపిణీ చేశాయన్నారు.