Site icon HashtagU Telugu

Rose Day : నేడే రోజ్ డే.. గులాబీల రంగులకు అర్థాలే వేరులే !

Rose Day

Rose Day

Rose Day : నేడే రోజ్ డే. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవం జరుపుకుంటారు. ఫిబ్రవరి 7న జరిగే రోజ్ డేతో వాలెంటైన్స్ డే వేడుకలు ప్రారంభమవుతాయని అంటారు.  గులాబీలకు ప్రేమతో ఉన్న అనుబంధం అలాంటిది. గులాబీ పువ్వును మనం ప్రేమకు చిహ్నంగా చూస్తుంటాం. ఫిబ్రవరి 7 నుంచి ఫిబ్రవరి 14 మధ్య ఉన్న టైంను ‘వాలెంటైన్స్​ వీక్’‌గా చెబుతుంటారు.ఇవాళ చాలామంది తమ ప్రేయసి లేదా ప్రియుడికి రోజాపూలు ఇచ్చి తమ ప్రేమను తెలుపుతుంటారు. ఈనేపథ్యంలో రోజ్​ డే వెనుక ఉన్న చారిత్రక విశేషాలు ఏమిటి ? ఇష్టమైన వ్యక్తులకు ఎలాంటి రోజా పూలు ఇవ్వాలి? ఏ రంగు గులాబీలకు ఎలాంటి ప్రత్యేకత ఉంది ? ఇప్పుడు తెలుసుకుందాం.

We’re now on WhatsApp. Click to Join

హిస్టరీ ఇదీ.. వీనస్ దేవతకు లింక్

పురాతన రోమన్ ప్రజలు గులాబీ పూలకు(Rose Day) వీనస్ అనే దేవతతో సంబంధం ఉంటుందని నమ్మేవారు. అరేబియా దేశాల సంస్కృతులలో కూడా గులాబీలను ప్రేమకు చిహ్నంగా నమ్ముతారు. గులాబీలు వివిధ రంగుల్లో లభిస్తున్నప్పటికీ.. లవర్స్​కి ఎరుపు రంగు గులాబీలనే ఇస్తారు. ఇతర రంగుల గులాబీలు ఇచ్చే సందేశాలు కూడా డిఫరెంట్ ఉంటాయి. మనకు ఇతరులతో ఉన్న సంబంధాన్ని బట్టి కానుకగా ఇచ్చేందుకు వివిధ రంగుల గులాబీలను ఎంచుకోవచ్చు.

Also Read : Employment Exchange 2024: తెలంగాణ ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్ఛేంజ్.. రిజిస్ట్రేషన్‌ ఇలా

రెడ్ రోజ్

రెడ్ రోజ్‌‌ను శృంగారానికి ప్రతీకగా భావిస్తుంటారు. ప్రియుడు లేదా స్నేహితురాలికి గులాబీని బహుమతిగా ఇవ్వొచ్చు. శృంగార వ్యక్తీకరణ కోసం గులాబీల గుత్తిని బహుమతిగా ప్రజెంట్ చేయొచ్చు.

ఆరెంజ్ రోజ్

ఆరెంజ్ రోజ్ అనేది శృంగారం కాకుండా ఇతర సంబంధాలపై మీకున్న ఆసక్తిని అద్దంపడుతుంది. మీరు ఒకవేళ ఆరెంజ్ గులాబీల గుత్తిని బహుమతిగా ఇస్తే.. ఇతరులతో మీ సంబంధంలో తదుపరి దశను తీసుకోవడానికి రెడీగా ఉన్నారని సిగ్నల్ ఇచ్చినట్టు. 

పీచ్ కలర్ రోజ్

ప్రేమను బయటికి చెప్పడానికి సిగ్గుపడే వారు.. పరోక్షంగా ప్రేమను వ్యక్తపర్చాలని భావించేవారు పీచ్ కలర్ రోజ్‌ను కానుకగా ఇవ్వొచ్చు.

ఎల్లో రోజ్

స్నేహానికి ప్రతీక పసుపు గులాబీ. ప్రేమించాలా ? స్నేహం చేయాలా ? అనే డైలమాలో ఉన్నవారు ఎల్లో రోజ్‌ను కానుకగా ఇవ్వొచ్చు. పసుపు గులాబీ జీవితకాల స్నేహానికి ప్రతీక. క్లోజ్ ఫ్రెండ్స్‌కు ప్రేమను వ్యక్తం చేయడానికి ఈ గులాబీ బెస్ట్.

లేత ఊదా గులాబీ

తొలి చూపులోనే ప్రేమలో పడ్డారనే విషయాన్ని చెప్పడానికి  లేత ఊదా గులాబీ ఇవ్వడం బెస్ట్.

పింక్ రోజ్

ఇతరుల పట్ల మీకున్న అభిమానాన్ని, కృతజ్ఞతను తెలియజేయడానికి పింక్ రోజ్‌ను వాడొచ్చు. మీరు అత్యంత విలువైన వారికి ఈ రకమైన గులాబీ ఇవ్వాలి.

తెల్ల గులాబీ

తెల్ల గులాబీ అనేది స్వచ్ఛత, విధేయత , యవ్వన ప్రేమకు చిహ్నం. మీలో నిజాయితీ ఉందనే విషయాన్ని ఈ గులాబీ చెబుతుంది. వాలెంటైన్స్ డే రోజున ఎవరికైనా తెల్ల గులాబీని ఇస్తే.. మీరు వారికి విధేయంగా ఉన్నారని అర్ధం.  మీరు వారితో భవిష్యత్తును గడపాలని అనుకుంటున్న సిగ్నల్‌ను తెల్ల గులాబీ పంపుతుంది. ఇంకెందుకు ఆలస్యం. మీకు నచ్చిన వ్యకికి ఈ రోజా పూలను ఇచ్చేసి రోజ్​డే‌ను సెలబ్రేట్ చేసుకోండి.