ప్రతి రోజు(Every Day)కు ఓ ప్రత్యేకత (Special ) ఉంటుంది..కానీ చాలామందికి ఆ ప్రత్యేకతలు తెలియవు.. సాధారణ డే మాదిరిగానే గడిపేస్తారు..కానీ ఆ రోజు ఆ ప్రత్యేకత తెలిస్తే అబ్బా మిస్ అయ్యిపోయామే అని ఫీల్ అవుతుంటారు. అందుకే మా ‘Hashtagu‘ టీమ్ మీకు ఆ ప్రత్యేకతలను గుర్తు చేస్తుంటుంది. ఇక ఈరోజు (ఫిబ్రవరి 13) ఎన్ని ప్రత్యేకట్లు ఉన్నాయో తెలుసా..? హ్యాపీ కిస్ డే (Happy Kiss Day), సరోజినీ నాయుడు జయంతి (National Women’s Day) , అలాగే ప్రపంచ రేడియో దినోత్సం (World Radio Day)..ఇలా ఈ ప్రత్యేకతలు ఈరోజు సంతరించుకున్నాయి.
సరోజినీ నాయుడు జయంతి (National Women’s Day) :
1879 ఫిబ్రవరి 13న సరోజినీ నాయుడు (Sarojini Naidu ) పుట్టినరోజు సందర్భంగా జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటాము. మహిళల అభివృద్ధిలో భారతీయ సమాజంలో ఉన్న దురాచారాలకు వ్యతిరేకంగా ఆమె పోషించిన కీలక పాత్రకు గుర్తింపుగా ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 13న ఆమె జన్మదినాన్ని జాతీయ మహిళా దినంగా జరుపుకుంటారు.
ఈమె 1879 వ సంవత్సరం ఫీబ్రవరి నెల 13 వ తేదీన హైదరాబాద్లో జన్మించారు. తండ్రి డా. అఘోరనాథ్ చటోపాద్యాయా, తల్లి శ్రీమతి వరద సుందరి. అఘోరనాథ్ హైదరాబాదు కళాశాలకి, (అనగా నేటి నిజాం కళాశాల) మొట్టమొదటి ప్రధానోపాధ్యాయుడిగా పనిచేసారు. తల్లి వరదాదేవి చక్కని రచయిత్రి. చిన్నతనం నుంచీ ఆమె బెంగాలీ భాషలో చక్కని కావ్యాలు, కథలు వ్రాయడం జరిగింది.
తండ్రి గారైన అఘోరనాథ్ ఎనిమిది భాషలలో పండితుడు. సంస్కృతం, బెంగాలీ, ఉర్దూ, గ్రీకు, జర్మనీ, హిబ్రూ, ఫ్రెంచ్, ఆంగ్లం మొదలైన భాషలు ఆయనకు అనర్గళంగా వచ్చు. వీరు ఎడిన్బరో విశ్వవిద్యాలయంలో డాక్టర్ పట్టాను పొందటం జరిగింది. సరోజినీ నాయుడు సద్ వంశంలో జన్మించటం వలనా, తల్లి దండ్రులు విద్యాధికులవటం వలన, ఆమెలో చిన్నతనం నుంచే కార్యదీక్షా, పట్టుదలా, విద్యపై తిరుగులేని సదభిప్రాయాలు ఏర్పడటం జరిగింది. ఏది చూసినా, ఎవరి మాటలు విన్నా పట్టించుకోకుండా తమ ఆలోచనల్లో తాముంటారు చాలా మంది. కొందరు ఆ విధంగా కాక బాల్యం నుంచి ప్రతి విషయంలోనూ కుతూహలం కనపరిచేది, పదకొండో సంవత్సరం వచ్చేసరికి ఆమె అనర్గళంగా ఇంగ్లీషు మాట్లాడి అందరినీ ఆశ్చర్యపరిచింది.
మహిళాభివృద్దికి ఎంతో కృషి చేసి 1906లో మహిళలకు విద్య అవసరమని దేశమంతా ఎన్నో మహిళా సమావేశాలు ఏర్పరచి మహిళల్లో చైతన్యం తీసుకురావడానికి ఎంతో పాటు పడ్డారు. స్వాతంత్ర్య సాధనలో తనూ పాలుపంచుకోవాలని ఆలోచించిన శ్రీమతి సరోజినీ నాయుడు కాంగ్రెస్ జాతీయ భావాలకు అనుగుణంగా నడుచుకోనారంభించింది. 1915 వ సంవత్సరం బొంబాయిలో జరిగిన కాంగ్రెస్ మహాసభలలో, 1916 లో జరిగిన లక్నో కాంగ్రెస్ సభలలో ఆమె పాల్గొనటం జరిగింది. ఆనాటి కాంగ్రెస్ భావాలు చాలా ఆదర్శంగా ఉండేవి. సరోజినీనాయుడు భారతదేశములో గల ముఖ్యమైన నగరాల్లో తిరుగుతూ స్వాతంత్ర్యోద్యమ ఉపన్యాసాలిచ్చి, ప్రజలతో భాష విప్లవము వచ్చేందుకు కారకురాలయినది. తనే దేశం, దేశమే తనుగా భావించి దేశ సేవ చేసిన అభేద భావాల మూర్తి రాజకీయ, సాంఘిక, సాంస్కృతిక, సాహిత్య రంగాలలో రకరకాలుగా సేవలు చేసి మానవ సేవ చేయదలుచుకున్న వారికి మార్గాలనేకం అని నిరూపించిన మహిమాన్వితురాలు. జీవితమంతా మానవ సేవకు, దేశసేవకూ అంకితము చేసి తన డెబ్బై వ యేట 1949 మార్చి 2 వ తేదీన లక్నోలో ప్రశాంతంగా కన్ను మూసింది.
* హ్యాపీ కిస్ డే (Happy Kiss Day) :
వాలెంటైన్ వీక్‌లో ప్రేమికుల రోజుకు ముందుగా వచ్చే రోజును ‘కిస్ డే’ అని అంటారు. ఈ ప్రత్యేకమైన రోజున ప్రేమికులు పరస్పరం ముద్దులు ఇచ్చిపుచ్చుకోవాలనుకుంటారు. వాలెంటైన్ వీక్‌లో ఫిబ్రవరి 13న ‘కిస్ డే’గా సెలబ్రేట్ చేస్తారు. ప్రేమించిన వారికి ముద్దు పెట్టి తమ ప్రేమను వారి ఎదుట వ్యక్తం చేస్తారు. బంధం బలపడాలంటే ముద్దు ఎంతో ముఖ్యం. నాలుగు పెదవులు కలిస్తే శరీరంలో లవ్ హార్మోన్లు, హ్యాపీ హార్మోన్లు విడుదలై ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ప్రేమికులు ఒకరికొకరు ఇచ్చే ముద్దులు చాలా రకాలుగా ఉంటాయి. నుదిటిపై ముద్దుపెట్టుకుంటే వారిపై మనకున్న ప్రేమ, చెంపపై ముద్దుపెట్టుకుంటే ప్రేమ అనురాగం మరింతగా ఉందని అర్థం. యునైటెడ్ కింగ్‌డమ్‌లో మొదలైన ఈ కిస్ డే ..ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యంలోకి వచ్చింది. అయితే ఈ కిస్ డే సందర్భంగా మీరు ప్రేమించిన వారికి ముద్దు తో శుభాకాంక్షలు తెలుపండి.
We’re now on WhatsApp. Click to Join.
* ప్రపంచ రేడియో దినోత్సవం (World Radio Day) :
కమ్మనైన కబుర్లు చెపుతూ ..మధురమైన పాటలు వినిపిస్తూ..ప్రపంచ సంగతులన్నీ వివరిస్తూ..ఇంట్లో ఒకరిగా కలిసిపోయి..కాలక్రమేణా కనుమరుగైపోయిన స్నేహితుడు రేడియో. అసలు ఈ రేడియో దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారు..? ఈరోజునే ఎందుకు జరుపుకుంటారు..? అనేది చూద్దాం.
1946, ఫిబ్రవరి 13న ఐక్యరాజ్యసమితి రేడియో ప్రారంభించబడింది కాబట్టి, ఆ సందర్భంగా ప్రతిఏటా ఫిబ్రవరి 13న ఈ దినోత్సవం జరుపుకునేలా జనరల్ కాన్ఫరెన్స్ 36వ సెషన్‌లో ప్రపంచ రేడియో దినోత్సవాన్ని ప్రకటించాలని బోర్డు యునెస్కోకు సిఫారసు చేసింది. ఐక్యరాజ్యసమితి సభ్య దేశాలు, ఐక్యరాజ్యసమితి సంస్థలు, అంతర్జాతీయ ప్రాంతీయ సంస్థలు, వృత్తి సంఘాలు, ప్రసార సంఘాలు, ప్రభుత్వేతర సంస్థలు మొదలైనవన్ని ప్రపంచ రేడియో దినోత్సవాన్ని జరుపుకోవాలని బోర్డు ఆహ్వానించింది. ప్రపంచ రేడియో దినోత్సవాన్ని జనరల్ అసెంబ్లీలో ఆమోదించడానికి, ప్రపంచవ్యాప్తంగా ఈ దినోత్సవం జరుపుకునే విధంగా యునెస్కో డైరెక్టర్ జనరల్ ఈ తీర్మానాన్ని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ దృష్టికి తీసుకురావాలని బోర్డు అభ్యర్థించింది. ఈ అభ్యర్థనను యునెస్కో జనరల్ కాన్ఫరెన్స్ పరిగణించి, 36 సి/63 ఫైల్‌లో ఉన్న తీర్మానాన్ని ఆమోదించింది. ప్రపంచ రేడియో దినోత్సవాన్ని 2011 నవంబరులో యునెస్కోలోని అన్ని సభ్య దేశాలు ఏకగ్రీవంగా ప్రకటించాయి అప్పటి నుండి ఫిబ్రవరి 13 న రేడియో దినోత్సవంగా జరుపుకుంటూ వస్తున్నాం.
ఈ రేడియో ను గుగ్లీల్మో మార్కోనీ కనిపెట్టారు.అతను 1895లో మొదటి రేడియో సిగ్నల్‌లను బదిలీ చేయగలిగాడు. ప్రస్తుతం ఈ రేడియో వాడకం చాలావరకు బంద్ అయ్యినప్పటికీ, అనేక నగరాల్లో పోర్టబుల్ FM రేడియో సిస్టమ్‌లు అందుబాటులో నడుస్తున్నాయి.
Read Also : Farmers: సూది నుంచి సుత్తి దాకా.. అన్నీ తెచ్చుకుంటున్నాం.. పంజాబ్ రైతులు
