Site icon HashtagU Telugu

Arjun Narendran: రికార్డుల రేసర్.. అర్జున్ నరేంద్రన్..!

Racer

Racer

అర్జున్ నరేంద్రన్ భారతదేశంలోని కోయంబత్తూరుకు చెందిన ఇండియన్ కార్ రేసర్. 2011లో ఇండియన్ నేషనల్ టూరింగ్ కార్ ఛాంపియన్‌లో పాల్గొనడం ద్వారా తన రేసింగ్ జర్నీమొదలైంది. వివిధ కార్ రేసుల్లో పాల్గొని భారత్ కు ఎన్నో విజయాలను అందించాడు. కంప్యూటర్ ఇంజినీరింగ్ చదివిన అర్జున్ నరేంద్రన్ కు చిన్నప్పట్నుంచే క్రికెట్ తో పాటు రేసింగ్ అంటే చాలా ఇష్టం. ఆ ఇష్టంతోనే వీధుల్లో డ్రైవింగ్‌ చేసేవాడు. అతని మేనమామ, వి. రాంనారాయణన్ అర్జున్ ఆసక్తులను దగ్గరగా గమనించి ఎంకరేజ్ చేశాడు. మంచి భవిష్యత్తుకు పునాది వేయాలని కలలుకన్నాడు. ఆయన ప్రోత్సాహంతో రేసింగ్‌ను సీరియస్‌గా తీసుకోవడం ప్రారంభించడు అర్జున్ నరేంద్రన్.

చిన్నతనంలో క్రికెటర్‌ ను ఇష్టపడే వ్యక్తి ప్రతిభావంతులైన రేసర్‌గా మారడం వెనుక కుటుంబ సభ్యుల ప్రభావం బలంగా ఉంది. తండ్రి, S. నరేంద్రన్, మేనమామ, V. రాంనారాయణ్ కూడా రేసర్లు కావడం, ఆ ప్రభావ అర్జున్ పై బలంగా పడింది. 2012 నుంచి తనకు మార్గదర్శకుడిగా, ఎన్‌. లీలాకృష్ణన్‌ నిలిచాడు. ఆయన దగ్గర రేసింగ్ స్కిల్స్ నేర్చుకున్నాడు. దూకుడుగా ఉండే యువకుడు ఎలాంటి అడ్డంకులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంటాడు. దూకుడుగా ఉండే అర్జున్ కు రేసింగ్ పట్ల ఆసక్తి పెరిగింది. గంటకు 200కిలోమీటర్ల వేగంతో కారును నడిపాడం నేర్చుకున్నాడు. ప్రమాదకరమైనది అయినప్పటికీ వేగాన్ని ఇష్టపడ్డాడు. రిస్క్‌లు తీసుకోవడం ఇష్టం కాబట్టి రిస్క్‌తో కూడుకున్న రంగాన్ని కొనసాగించాలనుకున్నాడు. రేసింగ్ లో అడుగుపెటిన కొన్నాళ్లే సెలబ్రిటీ రేసర్ గా మారాడు. కొద్దిరోజుల్లోనే ఇండియన్ నేషనల్ టూరింగ్ కార్ ఛాంపియన్‌గా నిలిచాడు. MRF ఫార్ములా ఫోర్డ్ 1600- 2 రేసుల్లో ఉత్తమంగా 4వ స్థానంలో నిలిచాడు.

సాధించిన విజయాలు కొన్ని

2011: ఇండియన్ నేషనల్ టూరింగ్ కార్ ఛాంపియన్‌షిప్‌ను 6వ స్థానం
2012: ఇండియన్ నేషనల్ టూరింగ్ కార్ ఛాంపియన్‌షిప్‌ లో 4వ స్థానం
2013: ఇండియన్ నేషనల్ టూరింగ్ కార్ ఛాంపియన్‌షిప్ పట్టికలో 5వ స్థానం. ఎటియోస్ మోటార్ రేసింగ్ ఎగ్జిబిషన్ లో 1వ స్థానం.
2015: మళ్లీ ఇండియన్ నేషనల్ టూరింగ్ కార్ ఛాంపియన్‌గా కిరీటాన్ని పొందారు. MRF ఫార్ములా ఛాంపియన్‌షిప్‌లో 2వ రన్నర్
2016:ఇండియన్ నేషనల్ టూరింగ్ కార్ ఛాంపియన్‌గా మరోసారి కిరీటాన్ని పొందారు.
2017:ఇండియన్ నేషనల్ రేసింగ్ ఛాంపియన్‌షిప్ గెలిచారు.

Also Read: Jasprit Bumrah: టీమిండియా అభిమానులకు శుభవార్త.. బుమ్రా వ‌చ్చేస్తున్నాడు..!