Site icon HashtagU Telugu

Kaleshwaram Commission : కేసీఆర్ పై రివెంజ్ తీర్చుకునే టైం ఈటెల కు వచ్చిందా..?

Etela Rajender Kaleshwaram

Etela Rajender Kaleshwaram

భారతీయ జనతా పార్టీ ఎంపీ (BJP MP) ఈటల రాజేందర్ (Etela Rajender)కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఏర్పాటు చేసిన విచారణ కమిషన్ (Kaleshwaram Commission) ముందు హాజరయ్యారు. జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఈ కమిషన్, ప్రాజెక్టులో జరిగిన అనియమాలు, అవకతవకలపై విచారణ చేపట్టింది. ఇప్పటి వరకు అధికారులను, ఇంజినీర్లను ప్రశ్నించిన కమిషన్, ఇప్పుడు రాజకీయ నేతల వైపు మొగ్గుతోంది. ఈటల రాజేందర్ ఆర్థిక మంత్రిగా పనిచేసిన సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిధుల విడుదల జరిగింది. ఆయన ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో తీసుకున్న నిర్ణయాలు, నిధుల కేటాయింపులపై ఆయనను ప్రశ్నించే అవకాశం ఉంది.

Vijay Mallya : నన్ను దొంగ అనద్దు.. న్యాయమైన విచారణకు హామీనిస్తే భారత్‌కు వస్తా

ఒకప్పుడు ఈటల రాజేందర్, కేసీఆర్ సన్నిహితులు. కానీ తర్వాత ఈటల రాజేందర్ ను పార్టీ నుంచి పంపడానికి కేసీఆర్ చాలా కుట్రలు చేశారు. తప్పుడు ప్రచారాలు చేయించి.. ఎస్సీల భూముల్ని కబ్జా చేశాడని నిందలు వేయించారు. చాలా ఆరోపణలు చేశారు. చివరికి పార్టీ నుంచి బయటకు పంపారు. అతి కష్టం మీద ఈటల రాజేందర్ .. తన రాజకీయ భవిష్యత్‌ను కాపాడుకున్నారు. బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరారు. అప్పటి నుంచి ఆయన రాజకీయ వైఖరిలో మార్పు కనిపించింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు ఈటల కమిషన్ ముందు ఇచ్చే స్టేట్‌మెంట్ రాజకీయంగా కీలకంగా మారనుంది. ఈటల తన మనోభావాల ప్రకారం కేసీఆర్ పై వ్యతిరేకంగా మాట్లాడతారా? లేక నిబంధనలకు అనుగుణంగా అన్నీ జరిగాయని చెబుతారా అన్నది ఆసక్తికర అంశంగా మారింది. గతంలో కేసీఆర్ చేసిన రాజకీయ కుట్రలపై ఈటల అనేకసార్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఆ కోపం ఇంకా మిగిలి ఉంటే, ఆయన స్టేట్‌మెంట్ కేసీఆర్‌కు సమస్యలు తెచ్చే అవకాశం ఉంది.

Elon Musk : ప్రభుత్వ కాంట్రాక్టుల రద్దుపై ట్రంప్ హెచ్చరిక.. మస్క్ ఘాటు స్పందన

ఇంతవరకు ఈటల రాజేందర్ కాళేశ్వరం విషయంలో పెద్దగా విమర్శలు చేయలేదు. అవినీతిపై కూడా ఆయన నేరుగా వ్యాఖ్యానించలేదు. పైగా ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ బీఆర్ఎస్ పాలనను సమర్థించడమే కాకుండా, కేసీఆర్ పాలన మెరుగైనదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆయన విచారణకు హాజరవడం బీజేపీ వర్గాల్లోనూ, రాజకీయ విశ్లేషకుల్లోనూ చర్చకు దారితీస్తోంది. కేసీఆర్, హరీష్ రావు తదితర నేతలు కూడా కమిషన్ ముందుకు రావాల్సి ఉండగా, పదకొండవ తేదీన కేసీఆర్ హాజరవుతారు. ఈ పరిణామాల నేపథ్యంలో కాళేశ్వరం విచారణ మరింత వేడెక్కనుంది.