Site icon HashtagU Telugu

Girls In Google: కొత్త పెళ్లికూతుళ్లు గూగుల్ లో ఏం సెర్చ్ చేస్తున్నారో తెలుసా!

Girls in Google

Google

పెళ్లి (Marriage) ప్రతిఒక్కరి జీవితంలో మరిచిపోలేని రోజు. ఎన్నో ఊహలతో, కలలతో ఇటు అమ్మాయిలు, అటు అబ్బాయిలు వైవాహిక జీవితంలో అడుగుపెడుతుంటారు. ముఖ్యంగా అమ్మాయిలు తనకు కాబోయేవాడి గురించి ఎప్పట్నుంచో కలలు కంటోంది. పెళ్లి తర్వాత ఏం చేయాలి? ఎలా ఉండాలి? అనే విషయాలపై ఆసక్తి పెంచుకుంటోంది. అయితే పెళ్లి చేసుకోబోయే అమ్మాయిలు గూగుల్ (Google) లో పలు విషయాల కోసం సెర్చ్ చేస్తున్నారని ఓ సర్వేలో తేలింది. అవి ఏంటంటే..

పెళ్లికి ముందు చాలా అమ్మాయిలు తన భర్తతో ఎలా ఉండాలి? ఏవిధంగా మూవ్ అయితే బాగుంటుంది? అనే విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. పెళ్లి తర్వాత మొదటిరోజు (ఫస్ట్ నైట్) భర్తతో ఏవిధంగా వ్యవహరించాలి? అనే విషయం గురించి కూడా సెర్చ్ చేస్తున్నారు. అయితే ఫస్ట్ నైట్ వ్యవహారాల్లో అమ్మాయిలే కాదు… అబ్బాయిలు కూడా సెక్సువల్ లైఫ్ గురించి సెర్చ్ చేస్తున్నారని తేలింది. కొత్త పెళ్లికూతుళ్లు భర్తకు కావల్సినవి, వారు ఇష్టపడేవి, ఇష్టపడనివి తెలుసుకుంటున్నారు. ఇక పెళ్లైన ఆడవాళ్ళు తమ భర్త మనసును గెలుచుకుని వాళ్లను ఎలా సంతోష పెట్టాలి అనే ప్రశ్నను కూడా అనేక సార్లు గూగుల్ (Google) లో  చాలాసార్లు వెతికినట్టు తేలింది.

అంతేకాదు.. తమ భర్తను తమ హద్దుల్లో ఎలా ఉంచుకోవాలి? అందుకు మార్గం గురించి గూగుల్ లో సెర్చ్ చేస్తున్నట్లు కూడా అధ్యయనంలో తేలింది. ఇంకా బిడ్డను కనడానికి సరైన సమయం ఎప్పుడు అనికూడా గూగుల్ ద్వారా తెలుసుకోవాలి అనుకుంటున్నట్లు అధ్యయనం (Survey) వెల్లడించింది. పెళ్లయిన తర్వాత కొత్త ఇంట్లో ఎలా ప్రవర్తించాలి? ఆ కుటుంబం లో ఎలా ఉండాలి? అత్తగారితో ఎలా సంతోషంగా ఉండాలి? అని పెళ్లైన మహిళలు గూగుల్లో సెర్చ్ చేస్తున్నట్లు తెలిసింది. అంతేకాకుండా, కుటుంబ బాధ్యతలను ఎలా చూసుకోవాలి? పెళ్లయ్యాక సొంతంగా వ్యాపారం ఎలా సాగించాలి? అనే విషయాలను గూగుల్ (Google) చేస్తున్నట్టు పలు సర్వేల్లో తెలింది.

Also Read: Cop Locks Women: మహిళను బంధించి, చితకబాదిన పోలీస్, వీడియో వైరల్!

Exit mobile version