Site icon HashtagU Telugu

Bathukamma: బతుకమ్మ పండుగ, విశిష్టత మీకు తెలుసా

Engili Pula Bathukamma

Engili Pula Bathukamma

Bathukamma: బతుకమ్మ అంటే బతుకునిచ్చే తల్లి అని అర్థం. భాద్రపద అమావాస్య లేదా పితృ( పేతర) అమావాస్య నుండి ఆశ్వీయుజ శుద్ధ అష్టమి వరకు ఈ బతుకమ్మ పండుగను జరుపుకుంటారు. తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమయిన పండుగ ఇది. రంగు రంగుల పూలతో త్రికోణాకారంలో పేర్చి బతుకమ్మ చుట్టూ తిరుగుతూ, పాటలు పాడుతూ బతుకమ్మ ఆడతారు. ఇది తెలంగాణ రాష్ట్ర పండుగ.

బతుకమ్మ పండుగ ప్రకృతి మాత, నీరు, మానవుల మధ్య సంబంధాన్ని తెలియజేస్తుంది. మహిళలు “బొడ్డెమ్మ” (బురదలో ఉన్న దుర్గామాత యొక్క మట్టి రూపం) తయారు చేసి బతుకమ్మలతో పాటు చెరువులో నిమజ్జనం చేస్తారు. ఇది చెరువుల శక్తిని పెద్దదిగా చేసి, ఎక్కువ నీటిని నిలుపుకోవడానికి సహాయం చేస్తుంది. పువ్వులు నీటిని శుద్ధి చేస్తాయి. దానిని శుభ్రపరుస్తాయి, తద్వారా గాలి నాణ్యతను మెరుగుపరుస్తుంది. ఈ పండుగలో పరమార్థం ఏమిటంటే బతుకమ్మను తయారు చేయడంలో మనం రకరకాల పూలను వాడతాం, ఎన్ని పూలు వాడిన కానీ అవన్ని పైకి పోతూ చివరకు గౌరమ్మ దగ్గరే కలిసిపోతాయి. ఈ పండుగ వ్యవసాయ స్ఫూర్తికి నివాళులు అర్పిస్తుంది, ప్రకృతి వైభవాన్ని తెలియజేస్తుంది.

ఈ పండుగ వర్షాకాలపు చివరిలో, శీతాకాలపు తొలి రోజులలో వస్తుంది. అప్పటికే వర్షాలతో చెరువులన్నీ మంచి నీటితో నిండి ఉంటాయి. రకరకాల పువ్వులు రంగు రంగులలో ఆరుబయటలో పూసి ఉంటాయి. వీటిలో గూనుగు పూలు, తంగేడు పూలు బాగా ఎక్కువగా పూస్తాయి. బంతి, చేమంతి, నంది వర్ధనం లాంటి పూలకు కూడా ఇదే సమయం. గూనుగు పూలను వివిధ రంగులలో ముంచి రకరకాలుగా వాడతారు. ముందు ఒక పెద్ద తాంబాళంలో పెద్దపెద్ద ఆకులను వేసి దాని చుట్టూ ఒక్కో పువ్వును పెట్టుకుంటూ మధ్యలో ఆకులు నింపుకంటూ బతుకమ్మను పేరుస్తారు. పైన ఒక పెద్ద గుమ్మడి పువ్వును పెట్టి దాని పైన గౌరమ్మను పెట్టి పూజిస్తారు.

ఒక్కోరోజు బతుకమ్మకు ఒక్కో పేరు

ఎంగిలి పువ్వు బతుకమ్మ

అటుకుల బతుకమ్మ

ముద్దపువ్వు / ముద్దపప్పు

నానా బియ్యం

అట్ల బతుకమ్మ

అలిగిన / అర్రెము / అలక

వేపకాయల బతుకమ్మ

వెన్నె ముద్దల బతుకమ్మ

సద్దుల బతుకమ్మ (చద్దుల బతుకమ్మ)

Exit mobile version