Site icon HashtagU Telugu

Solar Power: సోలార్ పవర్‌తో రైతుల జీవితాల్లో వెలుగులు.. ఎలాగో తెలుసా ?

Solar Power Farmers Agricultural Sector Agriculture Min

Solar Power: సోలార్ పవర్.. ఎన్నో రంగాలను సమూలంగా మార్చబోతోంది. వ్యవసాయరంగం రూపురేఖలను సైతం మార్చేయనుంది. దీనివల్ల తెలుగు రాష్ట్రాల రైతుల జీవితాల్లో వికాసం వెల్లివిరియనుంది. ఇంతకీ ఎలా ? అనేది ఈ కథనంలో  తెలుసుకుందాం..

Also Read :Celebrity Restaurants: కంగనా రెస్టారెంట్.. హైదరాబాద్‌లోని సినీతారల రెస్టారెంట్లు ఇవే

సోలార్ పవర్‌ను రైతులు ఇలా వాడుకోవచ్చు..  

  • కోల్డ్ స్టోరేజీలలో రైతులు పంటలు, కూరగాయలు, పండ్లను  నిల్వ చేస్తుంటారు.
  • ఇకపై సౌరశక్తితో(Solar Power) కోల్డ్ స్టోరేజీలు పనిచేస్తాయి.
  • త్వరగా పాడైపోయే పంటలను ఎక్కువ కాలం పాటు నిల్వ చేసేందుకు కోల్డ్ స్టోరేజీలు పనికొస్తాయి.
  • పశువుల శాలలు, కోళ్ల ఫారాలలో వెలుతురు, నీటి సరఫరాకు సోలార్ పవర్‌ను వాడొచ్చు.
  • సౌరశక్తిని వాడుకొని తక్కువ పెట్టుబడి వ్యయంతో ఎరువులను తయారు చేయొచ్చు.
  • సౌరశక్తిని ఉపయోగించి పొలాల్లో కాంతి ఉచ్చులు, విద్యుత్ కంచెలను ఏర్పాటు చేయొచ్చు.  పంటలను వన్యప్రాణుల నుంచి కాపాడొచ్చు.
  • ట్రాక్టర్లు, ఇతర వ్యవసాయ పరికరాలను నడపడానికి సోలార్ పవర్‌ ఉపయోగపడుతుంది. దీనివల్ల విద్యుత్ బిల్లులు, డీజిల్ ఖర్చులు తగ్గుతాయి. కాలుష్యం తగ్గుతుంది.
  • రైతులు పొలాల్లో సౌర విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకొని, అదనపు ఆదాయాన్ని ఆర్జించవచ్చు.

ఈ పథకాలతో రైతులకు ప్రయోజనం

  • ప్రధానమంత్రి కిసాన్ ఊర్జ సురక్ష ఏవం ఉత్థాన్ మహాభియాన్ (కుసుమ్) పథకం ద్వారా రైతులు తమ పొలాల్లో సౌర విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకోవచ్చు. దీనికోసం ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుంది.
  • ఈ సౌర విద్యుత్ ప్లాంట్లలో ఉత్పత్తి అయ్యే సౌరశక్తిని వ్యవసాయ అవసరాలకు ఉపయోగించుకోవచ్చు.
  • ఈ ప్లాంటులో ఉత్పత్తి అయ్యే అదనపు విద్యుత్తును గ్రిడ్‌కు అమ్ముకొని ఆదాయం పొందొచ్చు.
  • రైతులు, సహకార సంఘాలు, గ్రామ పంచాయతీలు, ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్‌లు, వాటర్ యూజర్ అసోసియేషన్‌లు ‘కుసుమ్’ పథకం ద్వారా లబ్ధి పొందొచ్చు.
  • 0.5 మెగావాట్ల నుంచి 2 మెగావాట్ల సామర్థ్యం కలిగిన సౌర విద్యుత్ ప్లాంట్లను రైతులు ఏర్పాటు చేసుకోవచ్చు.