Amartya Sen – Rothschild Family : నోబెల్ ప్రైజ్, భారత రత్నవంటి గొప్ప పురస్కారాలను అందుకున్న అమర్త్యసేన్ ను చూసి ప్రతీ భారతీయుడు గర్విస్తున్నాడు. భవిష్యత్తులోనూ ప్రతీ ఇండియన్ గర్విస్తాడు. ఆయన వ్యక్తిగత జీవితంతో ముడిపడిన కొన్ని ఆసక్తికర వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.. అమర్త్యసేన్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు. ఆయన మొదటి భార్య పేరు నవనీత దేవ్ సేన్. నవనీత ఒక భారతీయ రచయిత. ఆమె ద్వారా అమర్త్యసేన్ కు ఇద్దరు కుమార్తెలు అంతరా, నందన ఉన్నారు. అంతరా ఒక జర్నలిస్ట్, నందన బాలీవుడ్ నటి. 1971లో ఫ్యామిలీ లండన్‌కు మారిన కొద్దికాలానికే అమర్త్యసేన్, నవనీత విడిపోయారు. 1978లో ఇవా కలోర్నీ అనే ఇటాలియన్ ఆర్థికవేత్తను అమర్త్యసేన్ పెళ్లి చేసుకున్నారు. కలోర్నీ ద్వారా అమర్త్యసేన్ కు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుమార్తె ఇంద్రాణి న్యూయార్క్‌లో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నారు. కుమారుడు కబీర్ హిప్ హాప్ కళాకారుడు, షాడీ హిల్ స్కూల్‌లో మ్యూజిక్ టీచర్. అయితే ఇవా కలోర్నీ 1985లో క్యాన్సర్‌తో చనిపోయారు.
We’re now on WhatsApp. Click to Join
హార్వర్డ్ వర్సిటీలో పరిచయం, పెళ్లి..
1991లో ఎమ్మా జార్జినా రాత్స్ చైల్డ్‌ను అమర్త్యసేన్ మూడో పెళ్లి చేసుకున్నారు. ఆమె హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో హిస్టరీ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. అమర్త్యసేన్ కూడా ఇదే హార్వర్డ్ యూనివర్సిటీలో ఎకానమిక్స్ ప్రొఫెసర్ గా సేవలందిస్తున్నారు. ఈక్రమంలోనే వీరిద్దరి పరిచయం, పెళ్లికి దారితీసింది. ప్రస్తుతం ఎమ్మా జార్జినా రాత్స్ చైల్డ్ వయసు 75 ఏళ్లు. ఈనేపథ్యంలో ఎమ్మా జార్జినా రాత్స్ చైల్డ్‌ను పెళ్లి చేసుకున్న ఏడు సంవత్సరాల తర్వాత 1998లో అమర్త్యసేన్ కు ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి రావడం గమనార్హం. కరువుకు కారణాలు ఏమిటి ? కరువు పరిస్థితుల్లో ఆహార భద్రత సమస్యను అధిగమించేందుకు అనుసరించాల్సిన మార్గాలు ఏమిటి ? అనే అంశాలపై రీసెర్చ్ చేసినందుకుగానూ ఆయనకు నోబెల్ ప్రైజ్ వచ్చింది. 1999లో అమర్త్యసేన్ కు భారతరత్న కూడా ప్రకటించారు.
Also read : Petrol Diesel: తెలుగు రాష్ట్రాల్లో నేటి పెట్రోల్, డీజిల్ ధరలు ఇవే..!
రాత్స్ చైల్డ్ ఫ్యామిలీ శక్తియుక్తి..
రాత్స్ చైల్డ్ బ్యాంకింగ్ ఫ్యామిలీ అంటే ఆషామాషీ విషయం కాదు. ఈ కంపెనీ నికర ఆస్తి విలువ దాదాపు రూ.20 లక్షల కోట్లు. ప్రపంచ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ వ్యాపారంలో ఈ ఫ్యామిలీ టాప్ -5 లిస్టులో ఉంది. అమెరికాలో అధ్యక్ష ఎన్నికల టైంలో పార్టీలకు భారీగా విరాళాలు ఇచ్చే కంపెనీల్లో ఇది కూడా ఒకటి. ఈ కంపెనీ రెండో ప్రపంచ యుద్ధం టైంలో ఒక వైపు హిట్లర్ కు, మరోవైపు అమెరికాతో కూడిన మిత్రపక్ష సేనలకు కూడా డబ్బులు వడ్డీకి ఇచ్చింది. ఎవరు ఓడినా.. ఎవరు గెలిచినా.. ప్రయోజనం తమకే దక్కాలనే వ్యూహంతో ఇలా వ్యవహరించింది. బ్రిటీష్ రాయల్ ఫ్యామిలీకి అప్పులు ఇచ్చిన చరిత్ర కూడా రాత్స్ చైల్డ్ బ్యాంకింగ్ ఫ్యామిలీకి ఉంది. దీన్నిబట్టి ఈ ఫ్యామిలీకి ప్రపంచంలో ఎంత పలుకుబడి ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం రాత్స్ చైల్డ్ బ్యాంకింగ్ ఫ్యామిలీ హెడ్ గా జాకబ్ రాత్స్ చైల్డ్ (Amartya Sen – Rothschild Family) ఉన్నారు.