Site icon HashtagU Telugu

Signature Loans : బ్యాంక్ లో సిగ్నేచర్ లోన్ గురించి మీకు తెలుసా..?

Do You Know Banks Giving Si

Do You Know Banks Giving Si

ప్రతి ఆర్ధిక అవసరాలకు మనకు కావాల్సిన మొత్తాన్ని లోన్ రూపం లో పొందాలని అనుకుంటారు. కస్టమర్స్ యొక్క అవసరాలను బట్టి వారికి ఎలాంటి లోన్ కావాలో ఆ లోన్ ని బ్యాంక్ లు ఇస్తాయి. అయితే బ్యాంక్ లల్లో వెహికల్, పర్సనల్, హోం లోన్స్ ఇస్తాయని మనకు తెలుసు. వీటితో పాటుగా గోల్డ్ లోన్ కూడా ఇస్తరని అందరికీ తెలుసు. కానీ బ్యాంకుల్లో సిగ్నేచర్ లోన్ అనే ఒక ఫెసిలిటీ ఉందని చాలా మందికి తెలియదు. అసలు సిగ్నేచర్ లోన్ (Signature Loans) అంటే ఏంటి దాన్ని ఎలా తీసుకోవచ్చు అనేది ఒకసారి చూద్దాం.

బ్యాంక్ లో ఇచ్చే సిగ్నేచర్ లోన్ ఎలా ఇస్తారు అంటే కేవలం ఒకే ఒక్క సంతకంతో లోన్ ఇచ్చేస్తారు. ఎలాంటి డాక్యుమెంట్స్ లేకుండా ఈ సిగ్నేచర్ లోన్స్ బ్యాంక్ లు ఇస్తాయి. అయితే వీటికి అందరు అర్హులు కాదు. కొద్దిమందికి మాత్రమే బ్యాంకులు ఈ సిగ్నేచర్ లోన్ తీసుకునేందుకు అర్హత ఉంటుంది. ఈ సిగ్నేచర్ లోన్ ని క్యారెక్టర్ లోన్ అని కూడా అంటారు.

సిగ్నేచర్ లోన్ కూడా ఒకరకంగా పర్సనల్ లోన్ కిందకే వస్తుంది. ఈ లోన్ లను బ్యాంకులు ఎలాంటి సెక్యురిటీ లేకుండా జారీ చేస్తాయి. అయితే ఈ లోన్లకు వడీ రేటు ఎక్కువగా ఉంటుంది. క్రెడిట్ కార్డ్ వడ్డీ రేటుతో పోల్చితే ఇది కొద్దిగా బెటర్ గా ఉంటుంది. అయితే ఈ లోన్ పొందాలంటే మాత్రం ముందుగా బ్యాంక్ విశ్వాసాన్ని సంపాదించుకోవాల్సి ఉంటుంది.

సిగ్నేచర్ లోన్ (Signature Loans) కావాలంటే క్రెడిట్ స్కోర్ 580 నుంచి 700 వరకు ఉండాలి. నెలవారి పేమెట్లు అన్నీ సరిగా కడుతూ ఉండాలి అంతేకాదు సిగ్నేచర్ లోన్ తీసుకున్న తర్వాత ఈ.ఎం.ఐ పేమెంట్ చేసేందుకు తగినంత ఆదాయం వస్తూ ఉండాలి. సిగ్నేచర్ లోన్ పేమెంట్ ని చెల్లిస్తామని హామీ ఇవ్వాల్సి ఉంటుంది. సిగ్నేచర్ లోన్ కోసం ఒక గ్యారెంటర్ కూడా సైన్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి సిగ్నేచర్ లోన్ తీసుకుని పూర్తి పేమెంట్ అయ్యాక మళ్లీ మరోసారి లోన్ తీసుకునే అవకాశం ఉంటుంది. సిగ్నేచర్ లోన్లు హాస్పిటల్ బిల్స్, ఇంటి రీపైరింగ్, టూర్స్ లాంటి వాటికి ఈ లోన్లు ఇస్తారు.

Also Read : Prabhas Salaar : సలార్ సంక్రాంతికి వస్తాడా..?