Union Budget Facts : ఫిబ్రవరి 1వ తేదీ వస్తోంది. ఆ రోజున కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. ఇది యావత్ దేశ ఆర్థిక గతికి ఉద్దేశించిన అంశం. రాబోయే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి భారత ప్రభుత్వ ఆర్థిక వ్యూహాలను వివరించే సమర్పణే బడ్జెట్. దేశంలోని ఏయే రంగానికి ఎంత కేటాయించాలి ? పన్నులు ఎలా ఉండాలి ? వివిధ రంగాల ప్రజలకు ప్రోత్సహకాలు, రాయితీలు ఎలా ఉండాలి ? సంక్షేమ పథకాలకు కేటాయింపులు ఎలా జరగాలి ? డెవలప్‌మెంట్ కార్యక్రమాలకు ఎంతమేర నిధులను కేటాయించాలి ? అనే అంశాలన్నింటికి బడ్జెట్ పత్రం సమాధానం చెబుతుంది. భారత ప్రభుత్వం వైఖరికి అనుగుణంగా బడ్జెట్‌లో వివిధ రంగాలకు కేటాయింపులు జరుగుతాయి. త్వరలో మన ముందుకు కేంద్ర బడ్జెట్ రానున్న వేళ బడ్జెట్‌తో ముడిపడిన ఆసక్తికర, చారిత్రక విశేషాలను మనం తెలుసుకుందాం..
Also Read :Where is KCR : కేసీఆర్ ఎక్కడ ? గులాబీ బాస్ ‘హైడ్ అండ్ సీక్’.. కేటీఆర్ చేతిలో ‘కారు’ స్టీరింగ్
- మనదేశ తొలి బడ్జెట్‌ను 1948 ఫిబ్రవరి 28న ఆర్‌కే షణ్ముఖం చెట్టి(Union Budget Facts) ప్రవేశపెట్టారు.
- మన దేశంలో ఇప్పటివరకు ముగ్గురు ప్రధానులు మాత్రమే కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. 1958లో నెహ్రూ, 1970లో ఇందిరా గాంధీ, 1987లో రాజీవ్ గాంధీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.
- అతిపెద్ద కేంద్ర బడ్జెట్ ప్రసంగాన్ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేశారు. ఆమె 2020 సంవత్సరంలో 2 గంటల 42 నిమిషాల పాటు ప్రసంగించారు.
- 1977లో నాటి కేంద్ర ఆర్థికమంత్రి హిరూభాయ్ పటేల్ కేవలం 800 పదాలతో అతి చిన్న బడ్జెట్ ప్రసంగం చేశారు.
Also Read :Ola Electric Shock: ఓలాకు షాక్.. పడిపోయిన ఎస్1 స్కూటర్ అమ్మకాలు!
- మన దేశ చరిత్రలో తొలి పేపర్ లెస్ కేంద్ర బడ్జెట్‌ను 2021లో ప్రవేశపెట్టారు.
- మనదేశ బడ్జెట్‌ను సాయంత్రం 5 గంటలకు ప్రవేశపెట్టేవారు. 1999లో ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా తొలిసారిగా ఉదయం 11 గంటలకు ప్రవేశపెట్టారు.
- కేంద్ర బడ్జెట్‌ను 2016 సంవత్సరం వరకు ఫిబ్రవరి 28న ప్రవేశపెట్టే వారు. 2017లో ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టారు.
- 2017లో తొలిసారిగా రైల్వే బడ్జెట్‌ను కేంద్ర బడ్జెట్‌లో విలీనం చేశారు.
- 1973లో తొలిసారిగా మన దేశంలో బ్లాక్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. బడ్జెట్‌లో ద్రవ్యలోటు అతిగా ఉంటే ఈవిధంగా పిలుస్తారు. బడ్జెట్‌లో బయటికి కనిపించని వ్యయాలు అతిగా ఉన్నా బ్లాక్ బడ్జెట్ అని అంటారు. 1973లో ఇందిరా గాంధీ దేశ ప్రధానిగా ఉన్నారు.
- కేంద్ర ఆర్థిక మంత్రి హోదాలో 1962 నుంచి 1969 మధ్య కాలంలో పదిసార్లు కేంద్ర బడ్జెట్‌లను మొరార్జీ దేశాయ్ ప్రవేశపెట్టారు.