Site icon HashtagU Telugu

Snail Destroy Farm : ఈ నత్త పొలాన్ని నాశనం చేస్తుంది తెలుసా?

Did You Know That This Snail Will Destroy The Farm

Did You Know That This Snail Will Destroy The Farm

This Snail will Destroy the Farm : నిషేధిత నత్తలను ఆంధ్రప్రదేశ్లోని ఉయ్యూరులో ఓ వ్యక్తి వాటిని పెంచడం కలకలంగా మారింది . థాయ్ లాండ్ నత్తలు ప్రమాదకరమని, ఒక్కోటీ దాదాపు 50 సెంట్ల పొలంలోని పంటను నాశనం చేయగలదని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి నత్తలను ఉయ్యూరులోని విశ్వశాంతి విద్యాసంస్థల చైర్మన్ కుమారుడు మాదాల చంద్రశేఖర్ పెంచుతున్నారు. థాయ్ లాండ్ నుంచి తెప్పించి విద్యాసంస్థల ఆవరణలోనే ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసి పెంపకం చేపట్టారు. దీనికి సంబంధించి ఓ వీడియోను యూట్యూబ్ ఛానెల్ లో అప్ లోడ్ చేయడంతో ఆ ప్రమాదకరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఆ వీడియో చూసిన బయాలజీ నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అధికారులు వారిపై చర్యలు చేపట్టారు.

We’re now on WhatsApp. Click to Join.

విశ్వశాంతి విద్యాసంస్థల ఆవరణలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ప్రత్యేకంగా ట్యాంకుల్లో పెంచుతున్న నత్తలను (Snail), పెంపకం పద్ధతులను బయాలజీ నిపుణులు పరిశీలించారు. అందులోని నత్తలు నిషేధిత జాబితాలోనివి కావడంతో కేసు నమోదు చేశారు. థాయ్ లాండ్ నుంచి వాటిని తీసుకువచ్చిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు అందుకున్న సమాచారం. ప్రమాదకరమైన ఈ నత్తలను (Snail) దేశంలోకి ఎలా తీసుకువచ్చారు..? సెక్యూరిటీ తనిఖీల నుంచి ఎలా తప్పించుకున్నారనే వివరాలు ఆరా తీస్తున్నారు. ఈ నత్తలను ఎందుకు పెంచుతున్నారు.. ఏ దేశానికి ఎగుమతి చేస్తారనేది కూడా విచారిస్తున్నారు. కాగా, ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినట్లు పోలీసు అధికారులు తెలిపారు

Also Read:  Jeep Wrangler: జీప్ రాంగ్లర్ ఎస్‌యూవీని కొనుగోలు చేయనున్న కస్టమర్లకు షాక్.. ఇంత ధర చెల్లించాల్సిందే..!