Traffic Signal For Camels : చైనా కొన్ని వెరైటీ పనులు కూడా చేస్తుంటుంది. ఈక్రమంలోనే అది ఎడారిలో ట్రాఫిక్ సిగ్నల్స్‌ను ఏర్పాటు చేసింది. ఇంతకీ ఎందుకు ? అని ఆలోచనలో పడ్డారా ? వివరాలు తెలియాలంటే ఈ కథనం చదవాల్సిందే.
We’re now on WhatsApp. Click to Join
సింగింగ్ శాండ్ డ్యూన్స్
చైనాలోని గన్సు ప్రావిన్స్‌లో డన్ హువాంగ్ సిటీలో ఎడారి మధ్యలో ట్రాఫిక్ సిగ్నల్స్‌ను చైనా ఏర్పాటుచేసింది. ఎడారిలో వాహనాల రాకపోకలు జరగవు. అక్కడ రాకపోకలు సాగించేవి ఒంటెలు మాత్రమే. వాటి కోసమే ఈ సిగ్నల్స్. ఒంటెలతో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోందని గుర్తించిన చైనా సర్కారు ఈ ఏర్పాటు చేసింది. దున్‌హౌంగ్ సిటీలోని మింగ్షా పర్వత ప్రాంతం చాలా ఫేమస్. దీన్నే సింగింగ్ శాండ్ డ్యూన్స్ అని పిలుస్తుంటారు. ఇక్కడికి ఏటా పెద్దసంఖ్యలో టూరిస్టులు వస్తుంటారు.
Also Read : Mothers Day 2024 : పురాణాల్లో లెజెండరీ మదర్స్.. వారి త్యాగనిరతికి హ్యాట్సాఫ్
మింగ్షాకు టూరిస్టుల వెల్లువ
మింగ్షా పర్వత ప్రాంతానికి చేరుకోవాలంటే ఒంటెలపై సవారీ చేయాల్సిందే. టూరిస్టులను పర్వతంపైకి తరలించేందుకు ఒకేసారి వందలాది ఒంటెలు ఎడారిలో క్యూ కడుతుంటాయి. ఈ క్రమంలోనే కొన్ని సార్లు ఒంటెలు ఒకదానిపై ఒకటి దాడి చేసుకుంటాయి. దీంతో ప్రయాణికులు అసౌకర్యానికి గురవుతుంటారు. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకే 2021 సంవత్సరంలో ఎడారిలో ట్రాఫిక్ సిగ్నల్స్‌ను చైనా సర్కారు ఏర్పాటు చేసింది. ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ కూడా రంగులు మారుతుంటాయి. రెడ్ సిగ్నల్ పడితే ఒంటెలు(Traffic Signal For Camels) ఆగిపోవాలి. గ్రీన్ సిగ్నల్ పడితే ముందుకు వెళ్లొచ్చు. 2023 సంవత్సరంలో దాదాపు 37లక్షల మంది పర్యాటకులు మింగ్షా పర్వత ప్రాంతానికి వచ్చారు. ఇక్కడ ఒంటె సవారీ కోసం ఒక్కో ప్రయాణికుడి నుంచి రూ.1200 తీసుకుంటారు. అక్కడ దాదాపు 2 వేల ఒంటెలను ఈ సర్వీసు కోసం నిత్యం వాడుతుంటారట.
Also Read :Hardeep Nijjar : ఉగ్రవాది నిజ్జర్ హత్య కేసులో నాలుగో భారతీయుడి అరెస్ట్
ఒంటె పాలలో ఏమేం ఉంటాయంటే..
ఒంటె పాలలో లాక్టోఫెర్రిన్ అనే మూలకం ఉంటుంది. ఇది క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులతో పోరాడటానికి శరీరాన్ని సిద్ధం చేస్తుంది. ఒంటె పాలు ఆవు పాల కంటే తేలికైనవి. మిల్క్ షుగర్, ప్రొటీన్, కాల్షియం, కార్బోహైడ్రేట్, షుగర్, ఫైబర్, లాక్టిక్ యాసిడ్, ఐరన్, మెగ్నీషియం, విటమిన్ ఎ వంటి అనేక మూలకాలు ఇందులో ఉంటాయి. ఇవి మన శరీరాన్ని అందంగా, ఆరోగ్యంగా మారుస్తాయి.