Site icon HashtagU Telugu

Liquor Home Delivery: ఇంటికే ‘మద్యం’ డెలివరీ!

Wines

Wines

టెక్నాలజీ వాడకం పెరిగిపోవడంతో ప్రతిదీ మన ఇంటి ముందుకే నిమిషాల్లో డెలివరీ అవుతోంది. ఇప్పటి వరకు ఏం కావాలన్నా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవడానికి ప్రజలు అలవాటు పడిపోయారు. కోవిడ్ వల్ల ఇది మరింత మందికి అలవాటైంది. మెడిసిన్స్, ఫుడ్, గ్రాసరీస్, ఎలక్ట్రానిక్ వస్తువులు ఇలా అన్నింటినీ నెట్లో చూసి చకచకా ఆర్డర్ పెట్టేస్తున్నారు. అయితే మందుబాబులకు మాత్రం ఈ సదుపాయం లేక నిరాశకు గురవుతూ వచ్చారు. అయితే ఎట్టకేలకు వారి కల నెరవేరనుంది. మందుబాబులకు ఢిల్లీ ప్రభుత్వం త్వరలో గుడ్ న్యూస్ అందించనుంది. మద్యాన్ని ఇంటికే డెలివరీ చేసేందుకు చర్యలు ప్రారంభించింది. ఈ కొత్త విధానానికి ఢిల్లీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రుల సంఘం ఆమోదం తెలిపింది.

ఇటీవల కాలంలో మద్యం కొనుగోళ్లు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో అక్రమాలు కూడా వెలుగు చూస్తున్నాయి. ఈ తరుణంలో మద్యం ధరలను 25 శాతం తగ్గిస్తూ ఢిల్లీ సర్కారు నిర్ణయం తీసుకుంది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను ఢిల్లీలోని కేజీవాల్ సర్కారు నూతన మద్యం పాలసీ తీసుకొచ్చేందుకు యత్నాలు చేస్తోంది. త్వరలో ఇంటికే మద్యం డెలివరీ విధానానికి శ్రీకారం చుట్టనున్నారు. ఈ నిర్ణయం మందుబాబులకు గుడ్ న్యూస్ అందించినట్టయింది.

Exit mobile version