ఓవర్ నైట్ డ్యూటీలు, లేట్ మ్యారేజ్ స్ వల్ల అనేక సమస్యలు తలెత్తున్నాయి. ఉరుకుల పరుగుల జీవితంలో మనిషికి కాసింత విశ్రాంతి అనేది దొరకడం లేదు. ఇక కొత్త గా పెళ్లిల్లు చేసుకున్న జంటలు ఐవీఎఫ్ కేంద్రాలు చుట్టు తిరుగున్నారంటే సంతానోత్పత్తి రేటు ఏవిధంగా అర్దం చేసుకోవచ్చు. భార్యభర్తలు ఉద్యోగాలు చేయడం, డబ్బు సంపాదనలో దాంపత్య జీవితానికి తగిన సమయం కేటాయించడంతో ఈ సమస్యలు తలెత్తుతున్నాయి.
దేశంలో సంతానోత్పత్తి వృద్ధిరేటు క్షీణిస్తోందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితి దీర్ఘకాలం పాటు కొనసాగితే దేశంలో యువతరం జనాభా భారీగా తగ్గి మానవ వనరుల కొరత భవిష్యత్ తరాలపై తీవ్ర ప్రభావాలు చూపే అవకాశం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం సమాజంలో ఆర్థికపరమైన కారణాలు, చదువులు వృత్తిరీత్యా కారణాలతో లేటుగా పెళ్లిళ్లు చేసుకోవడం, ఆర్థికపరమైన కారణాలు, మారుతున్న ఆహారపు అలవాట్ల కారణంగా మనుషుల్లో సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గి సంతాన సాఫల్య కేంద్రాల చుట్టూ తిరుగుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది.
ఇటీవల విడుదల చేసిన నమూనా నమోదు వ్యవస్థ (SRS) డేటా 2020 ప్రకారం, భారతదేశంలో సగటు మొత్తం సంతానోత్పత్తి వృద్ధి రేటు 2008 నుండి 2010 వరకు (మూడేళ్ల వ్యవధి) 86.1గా ఉంది. 2018-20లో 68.7కి పడిపోయింది. SRS ప్రకారం డేటా, పట్టణ ప్రాంతాల్లో 15.6%తో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో 20.2% క్షీణత నమోదైంది.భారతదేశంలో సాధారణ సంతానోత్పత్తి రేటు (GFR) గత ఒక దశాబ్దంలో 20% పడిపోయిందని పలు హెల్త్ సర్వేలు సైతం చెబుతున్నాయి.