పుర్రెకో బుద్ది.. జిహ్వాకో రుచి (Habits) అన్నట్టుగా ఒక్కొక్కరికీ ఒక్కో అభిరుచి ఉంటుంది. కొందరికి గేమ్స్, మరకొందరికి ట్రావెలింగ్, ఇంకొందరు రీడింగ్, నేచర్ లాంటివంటే చాలా ఇష్టం. కానీ అతికొద్ది మందికి మాత్రమే తమ ఇష్ట ఇష్టాలను నెక్ట్స్ లెవల్ కు తీసుకెళ్లగలరు. హైదరాబాద్ (Hyderabad) అనగానే చార్మినార్, గోల్కొండ కోట లాంటివి మాత్రమే కాదు.. ఖరీదైన కార్లు (Rich Car) కళ్ల ముందు కదలాడుతాయి. విలాసవంతమైన కార్లను సేకరించినవారు చాలామందిని మనం చూశాం కూడా.
కానీ రిచ్ కా బాప్ అంటూ ఓ వ్యక్తి తన ఖరీదైన కారుతో హాట్ టాపిక్ మారాడు హైదరాబాద్ కు చెందిన ఓ వ్యక్తి. 37 ఏళ్ల నసీర్ ఖాన్ కు కార్ల (Rich Car) అంటే చాలా ఇష్టం. సోషల్ మీడియాలో డిఫరెంట్ లగ్జరీ కార్లతో ఫోజులిస్తూ చర్చనీయాంశమవుతున్నాడు. ప్రస్తుతం ఈ కారు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
నసీర్ ఖాన్ ఇటీవల తన కొత్త మెక్‌లారెన్ 765LT స్పైడర్ సూపర్‌కార్ కొనుగోలు చేశాడు. దీని ధర దాదాపు రూ. 12 కోట్లు (12 Crore Car). మెక్‌లారెన్ 765 LT స్పైడర్ భారతదేశంలోని అత్యంత ఖరీదైన సూపర్ కార్లలో ఒకటి. ఇటీవల హైదరాబాద్‌లోని తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో నసీర్ కు డెలివరీ అయ్యింది. “వెల్కమ్ హోమ్ MCLAREN 765LT స్పైడర్ ఈ అందాన్ని డెలివరీ చేయడానికి ఇంతకంటే మంచి ప్రదేశం ఉంటుందా” అని పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చాడు. ప్రస్తుతం నసీర్ పోస్టు అందర్నీ ఆకర్షిస్తోంది. కారు ధర తెలుసుకొని షాక్ అవుతున్నారు నెటిజన్స్.
Also Read: Roja Dance: థింసా డ్యాన్స్ తో దుమ్మురేపిన రోజా.. వీడియో వైరల్