Chetan Anand Exclusive: టాలెంట్ ఉంటే బ్యాడ్మింటన్ లోనూ దూసుకుపోవచ్చు: చేతన్ ఆనంద్ ఇంటర్వ్యూ!

బ్యాడ్మింటన్ అంటే చేతన్ ఆనంద్.. చేతన్ ఆనంద్ అంటే బ్యాడ్మింటన్. ఈ ఆటలో ఎంతో ఎత్తుకు ఎదిగిన ఆయన కోచ్ గానూ రాణిస్తున్నారు.

  • Written By:
  • Updated On - March 1, 2023 / 05:45 PM IST

హైదరాబాద్ (Hyderabad) అంటే బ్యాడ్మింటన్ (Badminton) హబ్.. ఇప్పుడే కాదు.. రెండు దశాబ్దాల నుంచే ఎంతో మంది ఛాంపియన్స్ ఇక్కడ్నుంచే పుట్టుకువచ్చారు. వారందరిలో ముందువరుసలో ఉంటారు చేతన్ ఆనంద్. నాలుగు సార్లు నేషనల్ ఛాంపియన్, మూడు సార్లు సౌత్ ఏషియన్ గేమ్స్ మెన్స్ ఛాంపియన్.. ఇంకా ఎన్నో ఇంటర్ నేషనల్ టైటిల్స్ ను సొంతం చేసుకున్నారు. అయితే గాయాలతో కెరీర్ త్వరగా ముగించాల్సి వచ్చినా.. కోచ్ గా తన లాంటి ఛాంపియన్స్ ను తయారు చేస్తున్నారు. మరి ఆయన కెరీర్? ప్రస్తుత ఇండియా బ్యాడ్మింటన్,  అకాడమీ విశేషాలకు సంబంధించి మరిన్ని విషయాలు (Chetan Anand) మాటల్లోనే తెలుసుకుందాం..

బ్యాడ్మింటన్ (Badminton) మీద ఎలా ఇంట్రెస్ట్ ఏర్పడింది?

నాన్నకు చిన్నప్పట్నుంచే ఆటలంటే ఇష్టం. ఆయన బ్యాడ్మింటన్ ఆడేందుకు వెళ్లినప్పుడు సరాదాగా తోడుగా వెళ్లేవాడ్ని. నేను స్కూలింగ్ ఉన్నప్పుడు బ్యాడ్మింటన్ కు సంబంధించిన ఓ అకాడమీ విజిట్ చేసింది. ఆ సమయంలో నాలో బ్యాడ్మింటన్ ఆటను గమనించిన కోచ్ భాస్కర్ బాబు బాగా ఎంకరేజ్ చేశారు. ఆ తర్వాత జరిగిన పోటీల్లో అనేక ప్రైజ్ లు గెలుపొందాను. అలా నా కెరీర్ మొదలైంది.

జర్నీ ఆరంభంలో ఎలా సాగింది?

ఈ గేమ్ లో ఎలాంటి అంచనాలు లేకుండానే అడుగుపెట్టాను. బ్యాడ్మింటన్ తో పాటు క్రికెట్ కూడా ఎక్కువగా ఆడేవాడ్ని. కానీ రోజులు గుడుస్తున్నకొద్దీ బాడ్మింటన్ ను ప్రేమించడం మొదలుపెట్టాను. జిల్లా, రాష్ట్రస్థాయిలో పోటీల్లో పాల్గొన్న మొదటిసారే నేను టోర్నమెంట్స్ గెలిచాను. చాలామంది కి సాధ్యంకాదు కూడా. ఏ టోర్నమెంట్ కు వెళ్లినా టైటిల్ గెలిచేవాడ్ని. బాడ్మింటన్ గా  నా కెరీర్ అలా మొదలైంది.

భారత బ్యాడ్మింటన్ (Badminton) దిగ్గజం దగ్గర ట్రైనింగ్ తీసుకోవడం ఎలా అనిపించింది?

నేను మొదట్లో భాస్కర్ బాబు వద్ద ట్రైనింగ్ పొందాను. ఎక్కువ రోజులు కోచింగ్ తీసుకున్నది ఆయన దగ్గరే. ఆ తర్వాత కెరీర్ కోసం హైదరాబాద్ కు వచ్చాను. ఆ సమయంలోనే ఆరీఫ్ దగ్గర ట్రైనింగ్ తీసుకున్నా. ఇద్దరు కోచ్ లు కూడా డెడికెషన్ తో ఉండేవాళ్లు. ఇద్దరి దగ్గర మంచి ట్రైనింగ్ పొందాను. అయితే నాకు చిన్నప్పట్నుంచే ఫిట్ నెస్ అంటే చాలా ఇష్టం. ఆరీఫ్ గారు ఫిట్ నెస్ కు ప్రయారిటీ ఇవ్వడంతో ఎలాంటి గాయాలు కాకుండా బాడ్మింటన్ ఆడగలిగాను. ఆయన స్పూర్తితో చాలా టైటిల్స్ గెలిచాను.

సీనియర్ నేషనల్ ఛాంపియన్ తర్వాత గ్యాప్ తీసుకోవడానికి కారణం?

నాకు 30 ఏళ్ల తర్వాత గాయాలు కావడం మొదలయ్యాయి. కొన్ని గాయాలు నన్ను బాధించాయి. కానీ ఆ తర్వాత 2008 నుంచి 2010 వరకు టాప్ టెన్ ప్లేయర్ గా కొనసాగాను. జూనియర్ నేషనల్ తర్వాత సీనియర్ నేషనల్ పోటీల్లో కూడా నా బెస్ట్ ఇచ్చాను. నాలుగు సార్లు నేషనల్ ఛాంపియన్, మూడు సార్లు సౌత్ ఏషియన్ గేమ్స్ మెన్స్ ఛాంపియన్ గా నిలిచాను. ర్యాకింగ్ టోర్నమెంట్స్ గెలుచుకోవడంతో ఇండియా నంబర్ 1 గా రికార్డుకెక్కాను.

కోచ్ గా మీ ఫీలింగ్ ఏంటి?

చాలా హ్యాపీగా ఉంది. నేను బెస్ట్ ప్లేయర్ కాబట్టి, కోచింగ్ కూడా బెస్ట్ ఇవ్వగలుగుతున్నా. ఇప్పుడిప్పుడే చాలామంది ఆటకు ఆసక్తి చూపుతున్నారు. అందుకే అకాడమీ నెలకొల్పాను. నా ద్వారా పిల్లలను మెరికల్లా తీర్చిదిద్దడానికి ట్రైన్ చేస్తున్నా. అయితే పిల్లలకు ఈ ఆటతో పాటు ఇతర యాక్టివిటీస్ ఇష్టం ఉండాలి. కాబట్టి నా అకాడమీ స్విమ్మింగ్ పూల్, ఇతర వసతులు ఏర్పాటు చేశాను. ఇండియా తరపున ఆడటం అనేది గొప్ప  విషయం. ఆడిన ప్రతిసారి గోల్డ్ టైటిల్ గెలిచాను. చాలామందికి బాడ్మింటన్ బెస్ట్ ఛాయిస్ గా మారింది. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను ఈ ఆట ఆడేందుకు ఎంకరేజ్ చేస్తున్నారు. మనలో టాలెంట్ ఉంటే ఈ ఆటలో రాణించడం సులువే. డెడికేషన్, హార్డ్ వర్క్ ఉంటేనే బ్యాడ్మింటన్ లో రాణించవచ్చు.