Life Style: నాటి పురాతన పద్ధతులు పాటిద్దాం, ఆరోగ్యాన్ని కాపాడుకుందాం!

జనాలు బ్యాక్ టు బేసిక్ అంటూ ములాల్లోకి వెళ్తున్నారు. దైనందిన జీవితంలో పురాతన పద్దతులను ఫాలో అవుతున్నారు.

  • Written By:
  • Publish Date - September 7, 2023 / 03:45 PM IST

Life Style: దేశవ్యాప్తంగా విచ్చలవిడిగా ప్లాస్టిక్ వినియోగం పెరిగిపోతున్న నేపథ్యంలో జనాలు బ్యాక్ టు బేసిక్ అంటూ ములాల్లోకి వెళ్తున్నారు. దైనందిన జీవితంలో పురాతన పద్దతులను ఫాలో అవుతున్నారు. పురాతన కాలంలో భారతీయులు ఇత్తడి, రాగి, రాతి గ్రైండర్లతో రూపొందించిన పాత్రలు, వస్తువులను ఉపయోగించారు.

ఆధునిక యుగంలో ఈ గొప్ప వారసత్వాన్ని పునరుజ్జీవింపజేస్తూ, ఉర్త్ ఇండియా ఈ డొమైన్‌లోని నైపుణ్యం కలిగిన కళావస్తువులు, నిపుణుల సహకారంతో ప్రత్యేకమైన ప్రత్యేకమైన డిజైన్‌లను అందజేస్తుంది. చక్కని ఇత్తడి వస్తువులు, సొగసైన రాగి చెంబులను కళ్ల ముందే ఆ ఫీలింగ్ వేరుగా ఉంటుంది.  వర్తమానంలో మన గత వైభవాన్ని త్యాగం చేయాల్సిన అవసరం లేదు. శుభకార్యాలకు కళ తెచ్చే రాగి, ఇత్తడి వస్తువులు మానవుని ఆరోగ్యానికీ సాయపడుతున్నాయి.

రాగి పాత్రలో ఉంచిన నీళ్లు మూడు గంటల కాల వ్యవధిలోనే క్రిమి రహితంగా మారి, వాటిని తాగే వారికి ఆరోగ్యాన్ని ఇచ్చేంతగా పరిశుద్ధత పొందుతాయి. పాత్రలలో నీటిని నిల్వ ఉంచడం వలన ఈ -కొలి బ్యాక్టీరియాలు సైతం నశించిపోతాయి. ఇత్తడి పాత్రలేమో జింక్, అలాయ్ మిశ్రమంతో తయారవుతాయి. జింక్ రోగ నిరోధక శక్తిని కలిగి ఉండటంతోపాటు ప్రొటీన్స్‌ను కూడా సమకూర్చేశక్తిని కలిగి ఉంటుంది. అందువలన ఇత్తడి ఆరోగ్యప్రదాయిగా గుర్తింపు పొందింది. ఇన్నీ లాభాలే ఉన్నాయి కాబట్టే నేటి జీవితంలో చాలామంది రాగి, ఇత్తడి పాత్రలకు ప్రాధాన్యం ఇస్తున్నారు.

Also Read: Pushpa 2 Leaked: పుష్ప2 సెట్ నుంచి వీడియో లీక్, నెట్టింట్లో వీడియో వైరల్!