Site icon HashtagU Telugu

Jayaho Chandrayaan-3 : జాబిల్లి పై జయకేతనం

Chandrayaan 3 Live

Chandrayaan 3 Live

అమృత కాలంలో తొలి ఘన విజయం – మోడీ

ప్రపంచంలో తొలిసారిగా చంద్రుడి దక్షిణ ధ్రువం పై అడుగుపెట్టాం – మోడీ

ఈ క్షణం కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూశా – మోడీ

జాబిల్లి పై జయకేతనం ఎగరవేసింది

అంతరిక్ష చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించిన భారత్

చంద్రుడి దక్షిణ ధృవం పై విజయవంతంగా అడుగుపెట్టిన రోవర్ ప్రజ్ఞాన్

భారత్ కొత్త చరిత్ర సృష్టించింది – ప్రధాని మోడీ

చంద్రయాన్ విజయం నవభారత్ జయధ్వానం – మోడీ

ఈ విజయం దేశం గర్వించే మహత్తర క్షణాలు – మోడీ

చంద్రయాన్ 3 ఘన విజయంతో నా జీవితం ధన్యమైంది – మోడీ

ఈ అద్భుత విజయం కోసం 140 కోట్ల ప్రజలు ఎదురుచూసారు – మోడీ

ప్రపంచం మొత్తం ఇప్పుడు చంద్రయాన్ 3 (Chandrayaan-3) పై దృష్టి పెట్టింది. చరిత్ర సృష్టించేందుకు భారత్ సిద్ధమైంది. ప్రపంచమే శభాష్ అనే తరుణం రానే వచ్చింది. సాంకేతికంగా ఎన్నో అడుగులు వేస్తున్న దేశాలకి కూడా సాధ్యం కాని చారిత్రాత్మకమైన మరెవరూ సాధించలేని అరుదైన ఘనతను భారత్ అంతరిక్ష సంస్థ సొంత కానుంది. అంతరిక్ష రంగంలో హేమాహేమీలు ఉన్నప్పటి వారు చేరుకోలేని ప్రాంతంలో భారతీయ జెండా రెపరెపలాడబోతోంది.

చంద్రుడి పై మెల్ల మెల్లగా చంద్రయాన్-3 (Chandrayaan-3) ల్యాండర్ దిగుతుంది. చంద్రుని దగ్గర 10 మీటర్లకు చేరుకున్న వెంటనే చంద్రయాన్ వేగం సెకనుకు 1.68 మీటర్లుగా ఉంటుంది. ల్యాండింగ్ సమయంలో వేగాన్ని కొలవడానికి వాహనంలో లేజర్ డాప్లర్ వెలోసిమీటర్‌ను అమర్చారు. సాఫ్ట్ ల్యాండింగ్‌ను విజయవంతం చేసేందుకు.. ఇస్రో చంద్రయాన్ ల్యాండింగ్ అల్గారిథమ్‌ను మార్చింది. కొన్ని కారణాల వల్ల నిర్ణీత ప్రదేశంలో ల్యాండింగ్ చేయలేకపోతే.. చంద్రయాన్-3ని వేరే ప్రదేశంలో ల్యాండ్ చేయవచ్చు. చంద్రయాన్ అంతరిక్ష నౌక విజయవంతంగా చంద్రుడిపైకి అడుగు మోపాలని ఆకాంక్షిస్తూ ప్రజలంతా పూజలు చేసారు.

చంద్రుడి రహస్యాలను ఛేదించేందుకు ప్రయోగించిన ‘చంద్రయాన్‌-3’ (Chandrayaan-3) ప్రయోగం ప్రస్తుతం కీలక దశకు చేరుకుంది. చంద్రుడిపై అడుగుపెట్టే ఘడియలు దగ్గరపడుతున్నా కొద్దీ మరింత ఆసక్తి పెరగుతోంది. చంద్రుడిపై నమూనాలను సేకరించేందుకు ప్రయోగించిన విక్రమ్‌ ల్యాండర్‌ చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండ్ కావాలని అంతా కోరుకుంటున్నారు. రష్యా ప్రయోగించిన ‘లూనా-25’ ప్రయోగం విఫలం కావడంతో చంద్రయాన్‌-3పై అందరి దృష్టిపడింది. ల్యాండింగ్‌ కనుక విజయవంతమైతే అంతరిక్ష చరిత్రలో భారత్‌ సరికొత్త రికార్డు నిలిపిన దేశంగా మారనుంది.