Chanakya Niti: పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా ? జీవిత భాగస్వామికి ఏ ఏ లక్షణాలు ఉండాలో తెలుసా?

పెళ్లి అనేది ప్రతి మనిషి జీవితంలో అతి ముఖ్యమైన ఘట్టం. స్త్రీ అయినా, పురుషుడు అయిన వారి జీవిత భాగస్వామిని సరిగ్గా ఎంచుకోకపోతే మిగిలిన జీవితం మొత్తం అష్ట కష్టాలను అనుభవించాల్సి ఉంటుంది.

Chanakya Niti: పెళ్లి అనేది ప్రతి మనిషి జీవితంలో అతి ముఖ్యమైన ఘట్టం. స్త్రీ అయినా, పురుషుడు అయిన వారి జీవిత భాగస్వామిని సరిగ్గా ఎంచుకోకపోతే మిగిలిన జీవితం మొత్తం అష్ట కష్టాలను అనుభవించాల్సి ఉంటుంది. అందుకే జీవిత భాగస్వామి ఎలా ఉండాలో వారికి ఎటువంటి లక్షణాలు ఉంటే మనకు సరి అయిన జోడి అవుతుందో ఆచార్య చాణక్యుడు తన చాణిక్య నీతిశాస్త్రంలో వివరించారు.

మన జీవితంలో విజయం పొందడానికి, ఒక సంతోషకరమైన జీవనాన్ని అనుభవించడానికి తన నీతి శాస్త్రంలో ఎన్నో ఉపయోగకరమైన సూచనలు చేశారు ఆచార్య చాణక్య. అందులో భాగంగానే పెళ్లి చేసుకునే ముందు కాబోయే జీవిత భాగస్వామికి ఈ లక్షణాలు ఉండేలా చూసుకొమ్మని సూచించారు చాణక్యుడు. ఈ లక్షణాలు ఉన్న జీవిత భాగస్వామిని వివాహం చేసుకుంటే మిగిలిన జీవితం సంతోషంగా ఉంటుందని తన నీతి శాస్త్రంలో వివరించారు ఆచార్య చాణక్య.

అందం కాదు, లక్షణాలు ముఖ్యం…
నేటి యువత తమ భాగస్వామి అందంగా, మంచి రంగులో ఉంటే చాలు అనుకుంటున్నారు. కానీ అది సుద్ద తప్పు. అందం కూడా ముఖ్యమే కానీ అందం కన్న భాగస్వామి లక్షణాలు మరీ ముఖ్యం. అందం కన్న ముందు మనసును చూడమంటాడు చాణక్య, కాలక్రమనే అందం చెదిరి పోతుంది కానీ మనుసు చనిపోయేంత వరకు ఒకేలా ఉంటుంది. విద్య, విలువలు, మంచి లక్షణాలు ఉన్న భాగస్వామిని ఎంచుకుంటే జీవితం స్వర్గంగా మారుతుందని అంటారు ఆచార్య చాణక్య.

ఒత్తిడిలో పెళ్లి చేసుకోవొద్దు..
ఆచార్య చాణక్యుడు చెసిన మరో సూచన నువ్వు ఒత్తిడి లో ఉన్నప్పుడు పెళ్లి చేసుకోకు. ఒత్తిడి లో ఉన్నప్పుడు మనం ఎక్కువగా ఆలోచించలేం, కానీ కాబోయే భాగస్వామి ఆచార వ్యవహారాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే పెళ్లి గురుంచి ముందుకు వెళ్లాలని నీతి శాస్త్రం చెబుతోంది.

సహనంతో ఉండేవాళ్లను భాగస్వామిగా ఎన్నుకోవాలి
నీతి శాస్త్రంలోని మరో కీలక అంశం ఏమిటంటే సహనంతో ఉండే వారినే భాగస్వామిగా స్వీకరించాలి. జీవితం అనేది నది లాంటిది, ఎప్పుడు ఒకే లా ఉండదు ఎత్తు, పల్లాలు ఉంటాయి, కష్టాలు నష్టాలు ఉంటాయి, బాధలు దుఃఖాలు సైతం ఉంటాయి, అందుకే సహనం తో ఉన్న భాగస్వామిని ఎన్నుకుంటే ఎటువంటి కష్ట కాలం అయిన మనల్ని వదిలేసి వెళ్ళరు. ఓపిక గల వ్యక్తి కాష్ట కాలాల్లో మనకు అండగా, ధైర్యంగా ఉంటారు. సహనంతో సరైన మార్గాన్ని చూపించి విజయ తీరాలకు చేరుస్తారు. అందుకే సహనంతో కూడిన జీవిత భాగస్వామి కోసం ఓపిక తో వేచి చూడండి.

We’re now on WhatsAppClick to Join

భగవంతుడిపై విశ్వాసం..
మీరు జీవిత భాగస్వామి కోసం వెతికే టప్పుడు తనకు దేవుడిపై నమ్మకం ఉందా లేదా అనేది చూడండి అని చెపుతారు చాణక్యుడు. ఎవరికైతే దేవుడిపై నమ్మకం ఉంటుందో వారు కట్టుబాట్లతో, భక్తి శ్రద్ధలతో, పెద్దలపై గౌరవం తో మెలుగుతారు. దేవుడిని పూజించే వారు జీవితంలోకి వస్తే కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకుంటారు. పరస్పర గౌరవం చాలా ముఖ్యం..పెళ్లి చెలుకునే ముందు మన జీవిత భాగస్వామికి ఇతరులను ఏ మేరకు గౌరవిస్తుందనేది శ్రద్దగా గమనించాలి. ఎందుకంటే జీవితంలో ఎవరైతే పరస్పర గౌరవాన్ని ఇచ్చుకుని జీవనం కొనసాగిస్తారో వారు సంతోషంగా ఉంటారు. ఏమాత్రం గౌరవ భంగం కలిగిన ఆ బంధం విడిపోయే ప్రమాదం ఉందని ఆచార్య చాణక్యుడు స్పష్టం చేశారు.

నిగ్రహం, కోపం..
ఎవరైతే నిగ్రహంగా ఉంటారో వారు తమ ఆలోచలని పదే పదే మార్చుకోరు. నిగ్రహంగా ఉండేవారు కుటుంబాలను అన్ని వేళలా రక్షిస్తారు. కష్ట కాలంలో రక్షణ కవచంలా నిలుస్తారు. మరో వైపు భాగస్వామి కోపాన్ని గమనించండి. కోపం ఎక్కువగా ఉంటే వారికి దూరంగా ఉండటమే మంచిది. కారణం వారు క్షణికావేశంలో అనే మాటలు ఆత్మ గౌరవాన్ని దెబ్బ తీస్తాయి. అటువంటి పరిస్థితుల్లో వివాహ బంధం ఎక్కువ కాలం నిలువదు. కోపం ఎంతటి అన్యోన్య జీవితలనైన విచ్చిన్నం చేస్తుంది. అందుకే సహనంతో ఉండే, కోపం లేని భాగస్వామి కోసం వెతకండి అని ఆచార్య చాణక్యుడు తన నీటి శాస్త్రంలో రాసారు.

Also Read: Z Category Security: ప్ర‌ధాన ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌కు ‘జెడ్’ కేట‌గిరీ భ‌ద్ర‌త‌.. కార‌ణ‌మిదే..?