Childrens Day 2024 : రేపు (నవంబరు 14న) మన దేశంలో బాలల దినోత్సవాన్ని జరుపుకోబోతున్నాం. భారత తొలి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ పుట్టిన రోజు సందర్బంగా నవంబరు 14వ తేదీని మనం బాలల దినోత్సవంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఎందుకంటే.. నెహ్రూకు పిల్లలు అంటే చాలా ఇష్టం. నేటి బాలలే భావి భారత పౌరులు అని నెహ్రూ చెప్పేవారు. బాలల భవితవ్యం బాగుండేలా ప్రభుత్వాలు పనిచేయాలని ఆయన చెబుతుండేవారు. నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పటికీ.. ఎక్కడికి వెళ్లినా పిల్లలను ఆప్యాయంగా పలకరించేవారు. వారిని దగ్గరకు తీసుకునే వారు. దీంతో పిల్లలంతా ఆయనను చాచా నెహ్రూ అని పిలిచేవారు. ఆయనకు గులాబీ పువ్వులు అంటే ఎనలేని మక్కువ. దీంతో గులాబీ పువ్వులను ఇచ్చి మరీ పిల్లలు నెహ్రూ చుట్టూ చేరేవారు.
Also Read :Bulldozer Action : ఆఫీసర్లు జడ్జీలు కాలేరు.. ఇళ్లను కూల్చేసే హక్కులు వాళ్లకు లేవ్ : సుప్రీంకోర్టు
అంతకుముందు నవంబరు 20న..
నెహ్రూ 1964వ సంవత్సరంలో తుదిశ్వాస విడిచారు. అంతకంటే ముందు కూడా మన దేశంలో బాలల దినోత్సవం జరుపుకునే వారు. అయితే అప్పట్లో ఐక్యరాజ్యసమితి తీర్మానం మేరకు.. నవంబరు 20వ తేదీన మన దేశంలో చిల్డ్రెన్స్ డేగా జరుపుకునేవారు. చాచా నెహ్రూ మరణం తర్వాత నాటి కేంద్ర ప్రభుత్వం బాలల దినోత్సవం తేదీని నవంబరు 14కు మార్చేసింది. అప్పటి నుంచి ఇప్పటివరకు మనం అదే తేదీన బాలల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం.బాలల దినోత్సవం సందర్భంగా పాఠశాలల్లో ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతుంటాయి. సాంస్కృతిక ప్రదర్శనలు, ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్లు నిర్వహిస్తుంటారు.
Also Read :Elections Today : ఓట్ల పండుగ.. జార్ఖండ్‌లో పోల్స్.. వయనాడ్, 31 అసెంబ్లీ స్థానాల్లో బైపోల్స్
ఇతర దేశాల్లో..
బాలల దినోత్సవం(Childrens Day 2024) చైనాలో జూన్ 1న, పాకిస్తాన్‌లో నవంబర్ 20న, జపాన్‌లో మే 5న, దక్షిణ కొరియాలో మే 5న, పోలాండ్‌లో జూన్ 1న, శ్రీలంకలో అక్టోబర్ 1న నిర్వహిస్తారు. బాలలకు సురక్షితమైన, ఆరోగ్యకరమైన బాల్యాన్ని అందించాలనేది ఈ దినోత్సవం ప్రధాన లక్ష్యం. బాలల హక్కులను పరిరక్షించడం, వారికి విద్య, శ్రేయస్సు కోసం శ్రమించడం అనేవి కీలకమైన అంశాలు.