26/11 Mumbai Attack Anniversary: యావత్ భారతావని ఇప్పటికి..ఎప్పటికీ మర్చిపోలేని గాయానికి నేటితో 14ఏళ్లు పూర్తి..!!

  • Written By:
  • Publish Date - November 26, 2022 / 11:27 AM IST

దేశఆర్థిక రాజధాని ముంబైలో ముష్కరుల ఘాతుకానికి పాల్పడి సరిగ్గా నేటితో 14ఏళ్లు. ఈ ఉగ్రదాడి ముంబై నగరాన్నే కాదు..యావత్ దేశాన్ని భయాందోళనకు గురిచేసింది. ఈ దాడిలో వందలాది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఎంతో మంది గాయపడ్డారు. ఈ ఉగ్రదాడి ఇప్పటికీ…ఎప్పటికీ మర్చిలేనిది. మాయన మచ్చలా భారతావని వెంటాడుతూనే ఉంటుంది. ఈ నేపథ్యంలో అమరుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ…దేశంలోని ప్రముఖలందరూ వారికి నివాళులర్పించారు.

నవంబర్ 6, 2008న ముంబై నగరంలో జరిగిన ఉగ్రదాడి..యావత్ భారతావనితో పాటు ప్రపంచాన్ని కూడా వణికించింది. భారత్ తోపాటు మరో 14 దేశాలకు చెందిన మొత్తం 166 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మారణహోమానికి నేటికి 14ఏళ్లు. లష్కరే తోయిబా ఉగ్రమూకలు…ముంబైలో 12చోట్ల నరమేధాన్ని స్రుష్టించారు. ఈ కాల్పుల్లో 166మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ముంబైకి చెందిన పోలీసు ఉన్నతాధికారులు కూడా ఉన్నారు. వందలాది మంది సామాన్యులు గాయపడ్డారు.

పాకిస్తాన్ కు చెందిన 10మంది టెర్రరిస్టులు భారత్ లోకి అడుగుపెట్టారు. నవంబర్ 26,2008సాయంత్రం కొలాబా సముద్ర తీరం నుంచి ముంబైకు చేరకున్నారు. గ్రూపులుగా విడిపోయారు. ఛత్రపతి శివాజీ మహరాజ్ టెర్మినల్ లో రద్దగా ఉన్న రైల్వే స్టేషన్ లోకి అడుగుపెట్టారు. వారి చేతుల్లో ఉన్న ఏకే 47 గన్నులతో విచ్చలవిడిగా కాల్పులు జరిపారు. పిట్టల్లా కాల్చిచంపారు. ఏం జరుగుతుందో అర్థం కానీ అమాయక జనం ఉరుకులు పరుగులు పెట్టారు. రైల్వే స్టేషన్లో భీకర వాతావరణం నెలకొంది. ఎక్కడ చూసినా రక్తపు మడుగులు. ప్రాణాలు కోల్పోయిన అమాయక జనాలు. దాదాపు ఈ కాల్పుల్లో 58మంది మరణించారు. రైల్వే స్టేషన్ లోని బయటకు వచ్చిన ఉగ్రవాదులు వీధుల్లో కూడా కాల్పులు జరిపారు. హస్పటిల్, ఒబెరాయ్ ట్రైడెంట్, తాజ్ హోటల్, లియోపోల్డ్ కేఫ్, నారిమన్ లైట్ హౌజ్ ఇలా వరసగా 12 చోట్ల దాడులకు పాల్పడ్డారు. దాదాపు 60గంటలపాటు ఈ మారణ హోం సాగింది. 166మంది ప్రాణాలు కోల్పోయారు. 18మంది భద్రతా సిబ్బంది సైతం అమరులయ్యారు. కేవలం భారతీయులే కాకుండా 14దేశాలకు చెందిన పౌరుల కూడా మరణించిన వారిలో ఉన్నారు.

బాధితులకు న్యాయం జరిగే వరకు భారత్ తన ప్రయత్నాలకు ఎప్పటికీ వదలుకోదని విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జై శంకర్ అన్నారు. ఈ రోజు 14వ వార్షికోత్సవం సందర్భంగా ముంబై ఉగ్రదాడుల బాధితులను భారతదేశం స్మరించుకుంటుంది. ఈ దాడికి కుట్ర పన్నినవారిని తప్పకుండా శిక్షిస్తుందని యావత్ భారతావని ఎదురుచూస్తోంది.