Site icon HashtagU Telugu

AGI : ‘ఏఐ’ను మించిన ‘ఏజీఐ’ వస్తోంది.. ఎలా పనిచేస్తుందంటే..

Agi Technology

AGI : ఇప్పటికే ఏఐ (ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్) టెక్నాలజీ ప్రపంచంలో కొత్త విప్లవాన్ని క్రియేట్ చేసింది. అయితే దాన్ని మించిన రేంజులో ఏజీఐ (ఆర్టిఫీషియల్ జనరల్ ఇంటెలీజెన్స్) టెక్నాలజీ ఉండబోతోందట.  ప్రస్తుతం ఏజీఐ టెక్నాలజీ రీసెర్చ్ దశలలోనే ఉంది. ఇంకొన్ని నెలల్లోనే దాని ఆవిష్కరణ కూడా జరుగుతుందనే అంచనాలు వెలువడుతున్నాయి. అయితే 2028కల్లా ఏజీఐ టెక్నాలజీ వచ్చేస్తుందని డీప్‌మైండ్‌ వ్యవస్థాపకుడు షేన్‌లెగ్‌ అంచనా వేస్తున్నారు. ఏదిఏమైనప్పటికీ లేటుగానైనా లేటెస్టుగా టెక్నాలజీ మార్కెట్‌లోకి ఏజీఐ(AGI) ఎంట్రీ ఇవ్వడం ఖాయమని తెలుస్తోంది.

We’re now on WhatsApp. Click to Join

‘సింగ్యులారిటీ నెట్‌’ అనే బ్రెజిల్ కంపెనీ అత్యంత శక్తిమంతమైన సూపర్‌ కంప్యూటర్లతో కూడిన ప్రపంచవ్యాప్త నెట్‌వర్క్‌‌ను వచ్చే నెలలో అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉంది. ఈ నెట్‌వర్క్‌లో పవర్ ఫుల్ హార్డ్‌వేర్‌ను వాడబోతున్నారు. అది అందుబాటులోకి వచ్చాక ఆర్టిఫీషియల్ జనరల్ ఇంటెలీజెన్స్‌ (ఏజీఐ) టెక్నాలజీపై రీసెర్చ్ ఊపందుకుంటుందని  అంచనా వేస్తున్నారు.  ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్‌పై రీసెర్చ్ చేస్తున్న ఆర్టిఫీషియల్‌ సూపర్‌ ఇంటెలీజెన్స్‌ అలయెన్స్‌ (ఏఎస్‌ఐ) కూటమిలో సింగ్యులారిటీ నెట్‌ కంపెనీ కూడా భాగస్వామిగా ఉంది. ఫేస్‌బుక్‌ అధిపతి మార్క్‌జుకర్‌బర్గ్‌ కూడా ఏజీఐ టెక్నాలజీ డెవలప్‌మెంట్ కోసం రూ.83వేల కోట్లు పెట్టుబడి పెట్టారు.

Also Read :Vali – Sugriva : వాలి, సుగ్రీవుల జన్మ వృత్తాంతం తెలుసా ? ఇదిగో చదివేయండి

ఏఐ టెక్నాలజీ వల్ల డేటా ఆధారిత సమాచార ప్రాసెసింగ్ శరవేగంగా  జరుగుతోంది. కానీ అది మనుషుల మెసేజ్‌లు, మాటలు, గొంతులను కచ్చితత్వంతో అంచనా వేయలేకపోతోంది. వాటిని అర్థం చేసుకోలేకపోతోంది. కానీ త్వరలో విడుదలయ్యే ఏజీఐ టెక్నాలజీ అచ్చం మనిషిలా ఆలోచించగలదు. మనిషి ఆలోచనలను అర్థం చేసుకోగలదు. మంచి, చెడుకు మధ్య తేడాను గుర్తించగలదు. ఉదాహరణకు ఏఐ టెక్నాలజీతో నడిచే సెల్ఫ్ డ్రైవింగ్ కారు.. ముందే లోడ్ చేసిన ప్రోగ్రాంకు అనుగుణంగానే రాకపోకలు సాగిస్తుంది. కానీ ఏజీఐ టెక్నాలజీ వచ్చాక రూపుదిద్దుకునే సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల రాకపోకలు మరింత కచ్చితత్వంతో జరుగుతాయి. ట్రాఫిక్, రద్దీ, దూరానికి అనుగుణంగా అవి తమ దిశను నిర్దేశించుకోగలవు. వాహన ప్రయాణ మార్గం విషయంలో సందర్భాన్ని బట్టి మార్పులు చేసుకోగలవు.

Also Read :Rains Alert : నేడు, రేపు తెలుగు రాష్ట్రాల్లోని ఈ జిల్లాలకు వర్షసూచన