Bill Gates A Farmer : బిల్‌గేట్స్ అనగానే మనకు టెక్ కంపెనీ ‘మైక్రోసాఫ్ట్’ గుర్తుకు వస్తుంది. వ్యవసాయం మాత్రం గుర్తుకు రాదు. వాస్తవానికి వ్యవసాయ రంగంలోనూ బిల్‌గేట్స్ యాక్టివ్‌గా ఉన్నారు. దాని నుంచి ఆయన ప్రతీ సంవత్సరం బాగానే సంపాదిస్తున్నారు. ఆ వివరాలను ఈ కథనంలో చూద్దాం..
Also Read :Made in India: త్వరలోనే మేడిన్ ఇండియా చిప్.. ఏమిటిది ? ఎవరు తయారు చేస్తారు?
వ్యవసాయ రంగంలో బిల్‌గేట్స్ ఏం చేస్తున్నారు ?
- బిల్‌గేట్స్(Bill Gates A Farmer) గత 20 ఏళ్లలో అమెరికాలోని ఇరవై రాష్ట్రాల్లో దాదాపు 3 లక్షల ఎకరాల వ్యవసాయ భూమిని కొన్నారు.
- వ్యవసాయ రంగంలోనూ సాధ్యమైనంత ఎక్కువ మందికి ఉపాధిని కల్పించేందుకే అంతగా భూమిని కొన్నానని బిల్‌గేట్స్ వెల్లడించారు.
- దాదాపు లక్ష ఎకరాల్లో క్యారెట్, సోయాబీన్, వరి, ఉల్లిపాయలు, మొక్కజొన్నలను బిల్‌గేట్స్ సాగు చేయిస్తున్నారు.
- 2 లక్షల ఎకరాల్లో ‘రసెట్ బర్బాంక్’ రకం బంగాళాదుంపల్ని బిల్‌గేట్స్ సాగు చేయిస్తున్నారు.
- ‘రసెట్ బర్బాంక్’ రకం బంగాళాదుంపల గురించి తెలుసా ? మనం మెక్‌డొనాల్డ్స్‌లో ఫ్రెంచ్‌ఫ్రైస్‌ను తింటాం కదా. అవి ‘రసెట్ బర్బాంక్’ రకం బంగాళాదుంపల నుంచే తయారవుతాయి.
- ప్రపంచవ్యాప్తంగా మెక్‌డొనాల్డ్స్ కంపెనీకి ‘రసెట్ బర్బాంక్’ రకం బంగాళాదుంపల్ని సప్లై చేసేది మరెవరో కాదు.. బిల్‌గేట్స్ కంపెనీయే.
- మెక్‌డొనాల్డ్స్ కంపెనీకి ఏడాది పొడవునా ‘రసెట్ బర్బాంక్’ రకం బంగాళాదుంపల్ని సరఫరా చేసేందుకు..పలువురు రైతులు, అగ్రో స్టార్టప్‌ల సాయంతో ఏడాదిలోని మూడు సీజన్లలోనూ పంటను బిల్‌గేట్స్ సాగు చేయిస్తున్నారు.
- మెక్‌డొనాల్డ్స్ కంపెనీకి ఏటా దాదాపు 36 లక్షల టన్నుల బంగాళాదుంపల్ని బిల్‌గేట్స్ సప్లై చేస్తున్నారు.
- బిల్‌గేట్స్‌కు చెందిన భూముల్లో చాలావరకు సేంద్రియ సాగు పద్దతులను అనుసరిస్తారట.
- గేట్స్ ఫౌండేషన్‌ను స్థాపించాక ప్రతికూల పరిస్థితులను తట్టుకునే మేలుజాతి వంగడాలను వృద్ధి చేయించారు. వాటిని ఆఫ్రికాలోని రైతులకు ఇచ్చి సాగు చేయించారు. ఆ రైతులకు పెట్టుబడి కోసం వడ్డీలేకుండా రుణాలిచ్చారు.
- చాలాదేశాల్లోని పేదలు ఎ విటమిన్ లోపంతో బాధపడుతున్నారు. ఈ సమస్య గురించి తెలుసుకున్న బిల్‌గేట్స్ గోల్డెన్ రైస్ పేరుతో విటమిన్ ఎ సమృద్ధిగా ఉండేలా ఫోర్టిఫైడ్ రైస్‌ను వృద్ధి చేయించారు. అలా 2013 వరకు గేట్స్ ఫౌండేషన్ ద్వారా పరోక్షంగా వ్యవసాయంలో బిల్‌గేట్స్ భాగమయ్యారు.
- 2013 తర్వాతి నుంచి నేరుగానే వ్యవసాయ రంగంలోకి బిల్‌గేట్స్ ఎంటర్ అయ్యారు.