BiggBoss 7 లో మూడో పవర్ అస్త్ర దక్కించుకునేందుకు హౌస్ మెట్స్ పోటీ పడుతున్నారు. ఈ వారం 3వ పవర్ అస్త్ర పొందేందుకు అర్హులుగా బిగ్ బాసే ప్రత్యక్షంగా ముగ్గురు కంటెస్టెంట్స్ ని ఎంపిక చేశాడు. అందులో అమర్ దీప్, యావర్, శోభా శెట్టి ఉన్నారు. అయితే వీరు పవర్ అస్త్ర కండెండర్ గా వద్దు అనుకునే వారు కన్ ఫెషన్ రూం కి వెళ్లి బిగ్ బాస్ అడిగిన కారణాలు చెప్పొచ్చు. అయితే ఈ ముగ్గురిలో అమర్ దీప్ బదులుగా ప్రియంకా పవర్ అస్త్రకి సెలెక్ట్ అయ్యింది.
యావర్, ప్రియాంక, శోభా శెట్టిల మధ్య పవర్ అస్త్ర పోటీ జరుగుతుంది. అయితే నేటి ఎపిసోడ్ లో ఆ ముగ్గురిలో ఏ ఇద్దరు ఏకాభిప్రాయంతో ఒకరిని ఈ పవర్ అస్త్రా పోటీ నుంచి తొలగిస్తారో వారు ఎగ్జిట్ అవుతారని అనగా శోభా ప్రియాంక ఇద్దరు కలిసి యావర్ ని అవుట్ చేస్తారు. ఈ టాస్క్ జరిగే టైం లో యావర్ మరోసారి అగ్రెసివ్ అయ్యాడు. 3వ పవర్ అస్త్ర పోటీదారులుగా ప్రియాంక, శోభా శెట్టి నిలిచారు.
అయితే వారికి బుల్ టాస్క్ ఒకటి ఇచ్చాడు బిగ్ బాస్. ఈ టాస్క్ లో ఎవరు గెలిచారు ఎవరు 3వ పవర్ అస్త్ర సాధించారు అన్నది ఈరోజు ఎపిసోడ్ లో తెలుస్తుంది. బిగ్ బాస్ సీజన్ 7 అనుకున్నట్టుగానే కంటెస్టెంట్స్ మధ్య మంచి ఆట ఆడిస్తున్నాడు బిగ్ బాస్. అయితే ఇప్పటికే మొదటి వారం పవర్ అస్త్ర సందీప్, రెండో వారం పవర్ అస్త్ర శివాజి గెలుచుకోగా 3వ పవర్ అస్త్ర కోసం ప్రియాంక, శోభా శెట్టిలు పోటీ పడుతున్నారు.
స్టార్ మా టీం అంతా కలిసి యావర్ ని టార్గెట్ చేస్తుంది అన్న యాంగిల్ లో ఎపిసోడ్స్ ఉన్నాయి. ఈ క్రమంలో యావర్ గ్రాఫ్ రోజు రోజుకి పెరుగుతుంది. యావర్ టాస్కుల్లో బెస్ట్ పర్ఫార్మ్ చేస్తున్నా అతను ఓడిపోతే మాత్రం కంట్రోల్ చేసుకోలేక అగ్రెసివ్ అయిపోతున్నాడు. మరి ఈ ఒక్క విషయం యావర్ తెలివిగా ప్రవర్తిస్తే అతను కొంతకాలం హౌస్ లో ఉండే అవకాశం ఉంటుంది.
Also Read : Surya : తమిళ హీరోతో బోయపాటి.. త్వరలోనే అనౌన్స్ మెంట్..!