Site icon HashtagU Telugu

BiggBoss7 : అతన్ని హీరో చేస్తున్న కంటెస్టెంట్స్..!

Biggboss 7 Contestants Doin

Biggboss 7 Contestants Doin

బిగ్ బాస్ సీజన్ 7 లో వీక్ అనుకున్న వాళ్లు స్ట్రాంగ్ స్ట్రాంగ్ అనుకున్న వాళ్లు వీక్ అవడం జరుగుతుంది. ప్రతి సీజన్ కు వచ్చినట్టుగానే ఈసారి కూడా ఒక మోడల్ ప్రిన్స్ యావర్ ని హౌస్ లోకి తీసుకొచ్చారు. మొదటి వారం సైలెంట్ గా ఉన్న అతను రెండో వారం నుంచి స్ట్రాంగ్ ఫైట్ ఇస్తున్నాడు. లాస్ట్ వీక్ అయితే తను బాగా ఆడుతున్నా సరే హౌస్ మెట్స్ కొందరు తనని కావాలని టార్గెట్ చేస్తున్నాడని ఫైర్ అయ్యాడు. గౌతం కృష్ణతో చాలా పెద్ద గొడవే అయ్యింది. ఇక లేటెస్ట్ గా మరోసారి ప్రిన్స్ యావర్ తన ఆవేశాన్ని ప్రదర్శించాడు.

హౌస్ లో మూడో పవర్ అస్త్ర పొందేందుకు బిగ్ బాస్ అమర్ దీప్, శోభా శెట్టిలతో పాటుగా ప్రిన్స్ యావర్ ను సెలెక్ట్ చేశాడు బిగ్ బాస్. అయితే బిగ్ బాస్ ఇందులో కూడా మెలిక పెడుతూ మిగతా హౌస్ మెట్స్ ఎవరు అర్జులు కాదంటారో చెప్పండని కన్ఫెషన్ రూం లో పిలిచి చెప్పమన్నాడు. అందులో ముగ్గురు యావర్ పేరు చెప్పారు. దానితో మూడో పవర్ అస్త్ర రేసు నుంచి ప్రిన్స్ తొలగే అవకాశం ఏర్పడింది. అయితే యావర్ తనని (BiggBoss7) బిగ్ బాస్ గుర్తించినా హౌస్ లో కొందరు గుర్తించలేదని ఆవేశ పడ్డాడు. ఆ టైం లో బిగ్ బాస్ ప్రాపర్టీస్ మీద కొంత ఆవేశాన్ని చూపించాడు.

సీన్ అర్ధమైన (BiggBoss7) బిగ్ బాస్ మళ్లీ రేసులో యావర్ ఉండాలంటే హౌస్ మెట్స్ ఏం చేసినా పెడస్టల్ మీద నుంచి కదలకూడదని టాస్క్ ఇచ్చాడు. యావర్ తన ప్రవర్తన మార్చుకునేందుకు బిగ్ బాస్ ఈ టాస్క్ ఇచ్చాడు. కానీ ఆ టాస్క్ లో ఎవరు ఏం చేసినా కదలకుండా యావర్ టాస్క్ గెలిచాడు. అయితే కంటెస్టెంట్స్ యావర్ ని కదిలించే టైంలో అతని మీద చాలా రకాల ప్రయోగాలు చేశారు. ఎంత టాస్క్ లో భాగమైనా అతన్ని బాగానే ఇబ్బంది పెట్టారని చెప్పొచ్చు.

ఈ ఎపిసోడ్ అంతా కూడా యావర్ ని ఆడియన్స్ కు దగ్గరయ్యేలా చేస్తుంది. ముఖ్యంగా కంటెస్టెంట్స్ అందరిలో యావర్ ని హీరోగా నిలబెడుతుంది. రోజు రోజుకి టఫ్ ఫైట్ పెరుగుతున్న బిగ్ బాస్ సీజన్ 7 లో రానున్న రోజుల్లో ఆట మరింత ఆసక్తికరంగా ఉంటుందని మాత్రం చెప్పొచ్చు.

Also Read : Naga Chaitanya : ఆఖరి నిమిషంలో హీరోయిన్ మారిందా..?