Site icon HashtagU Telugu

Bigg Boss 7 ఎలిమినేట్ అయిన ఆ కంటెస్టెంట్.. రీజన్స్ ఇవేనా..?

Bigg Boss 7 Shocking Elemin

Bigg Boss 7 Shocking Elemin

బిగ్ బాస్ సీజన్ 7 (Bigg Boss 7) మూడో వారం హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతున్నారన్నది లీక్ అయిపోయింది. ఆల్రెడీ రాత్రి నుంచే ఒక కంటెస్టెంట్ పేరు సోషల్ మీడియాలో వైరల్ కాగా శనివారం ఆల్రెడీ సండే ఎపిసోడ్ షూటింగ్ పూర్తవుతుంది కాబట్టి ఆ వార్తల్లో నిజం ఉందని చెప్పొచ్చు. ఇక లేటెస్ట్ గా అఫీషియల్ గానే ఆ కంటెస్టెంట్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయినట్టు తెలుస్తుంది. మూడో వారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యేందుకు ఏడుగురు కంటెస్టెంట్స్ నామినేషన్స్ లో ఉన్నారు.

ప్రియాంకా, శుభ శ్రీ, గౌతం, దామిని, రతిక, యావర్,అమర్ దీప్ లలో ఈ వారం దామిని హౌస్ కి గుడ్ బై చెప్పేసిందని తెలుస్తుంది. సింగర్ గా ప్రేక్షకులకు బాగా పరిచయం ఉన్న దామిని హౌస్ లో కేవలం వంట మాత్రమే చేస్తూ కనిపించింది. టాస్కుల్లో కూడా ఆమె పెద్దగా పర్ఫార్మ్ చేసింది లేదు. ఇంకాస్త టైం దొరికితే ఒకవేళ ఆమె ఏమన్నా ఆట ఆడేది ఏమో కానీ 3 వారాలు చూసిన ఆడియన్స్ ఆమె హౌస్ కి అన్ ఫిట్ అనుకున్నారు.

అందుకే ఓటింగ్ లో లీస్ట్ ఉంచి దామినిని ఎలిమినేట్ అయ్యేలా చేశారు. బిగ్ బాస్ సీజన్ 7 (Bigg Boss 7) ఈ వారం ఒక ఎలిమినేషన్ మాత్రమే కాదు ఒకరిద్దరు కంటెస్టెంట్స్ హౌస్ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ కూడా ఉంటుందని తెలుస్తుంది. దామిని బయటకు రాగా ప్రస్తుతం హౌస్ లో కేవలం 11 మంది మాత్రమే ఉన్నారు. అయితే హౌస్ లో మరో ఇద్దరు కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డ్ గా వస్తారని ప్రచారం జరుగుతుంది.

వైల్డ్ కార్డ్ ఎంట్రీ తర్వాత మొదటి రెండు వారాలు ఎలాగు ఆల్రెడీ మొదటి నుంచి ఉన్న హౌస్ మెట్స్ అంతా కూడా వారిని టార్గెట్ చేయడం మాములే. మరి వైల్డ్ కార్డ్ గా ఎవరెవరు వస్తున్నారు. వారి ఆట ఎలా ఉంటుంది అన్నది చూడాలి.

Also Read : TTD Electric Bus Thefted : తిరుమల శ్రీవారి బస్సు చోరీ..!